Bandla Ganesh Cheque Bounce Case:
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు పెద్ద షాప్ ఎదురైంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ కి ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో విచారణ కోసమే నిర్మాత బండ్ల గణేష్ ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన్ని షాక్ కి గురి చేస్తూ ఈ కేసు గురించి తుది తీర్పు ఇస్తూ జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ కేసులోని ట్విస్ట్ ఏమిటి అంటే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ నెలలోపు ఆయన అప్పీల్ చేసుకుని జైలు శిక్ష నుంచి బయటపడవచ్చు.
అసలు విషయానికి వస్తే 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద బండ్ల గణేష్ దాదాపు రూ.95 లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో జెట్టి వెంకటేశ్వర్లకు బండ్ల గణేష్ చెక్ ఇచ్చారు. ఈ చెక్ బౌన్స్ కారణం వల్ల వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు బండ్ల గణేష్‌కు సంవత్సరం రోజులు జైలు శిక్ష, దానితోపాటు జరిమానా విధించింది. అలాగే కోర్టు ఖర్చులకు అదనంగా రూ.10 వేలు కూడా బండ్ల గణేష్ చెల్లించాలని పేర్కొంది. అయితే బండ్ల గణేష్ కోర్టు తీర్పును ఎగువ కోర్టుకు సవాల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈరోజు వెంకటేశ్వర్లు ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఇరువైపులా వాదనలు విన్నది. ఈ కేసుకు విచారణకు హాజరవ్వాలని ఇంతకుముందు కూడా పలుసార్లు కోర్టు బండ్ల గణేష్‌కు నోటీసులు జారీ చేసింది. కానీ బండ్ల గణేష్ మాత్రం హాజరు కాలేదు. దీంతో కోర్టు బండ్ల గణేష్ మీద గతంలో అరెస్టు వారెంటు కూడా జారీచేసింది. ఈ క్రమంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు బండ్ల గణేష్ ను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ కూడా వెళ్లారు.
అయితే ఇలా జరగడం ఈ నిర్మాతకి మొదటిసారి కాదు.
ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే తరహాలో హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు గతంలో బండ్ల గణేష్ కు 6 నెలల జైలు శిక్ష విధించింది. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో ఈ ఘటన చోటుచేసుకుంది. 2017లో టెంపర్ సినిమా వ్యవహారంలో దర్శకుడు వక్కంతం వంశీకి రూ.25 లక్షల చెక్ ఇచ్చారు గణేష్. అది బౌన్స్ కావడంతో వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించారు. ఇక ఆయన వాదన విని కోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ.15.86 లక్షల జరిమానా విధించింది. కానీ వెంటనే బెయిల్ అప్లై చేసుకోగా, కోర్టు బండ్ల గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
Also Read: Chalo Nalgonda: రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు.. కేటీఆర్, హరీశ్ రావు బస్సుపై కోడిగుడ్లతో దాడి
Also Read: KTR Viral Tweet: శభాష్ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్ ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook