Bandla Ganesh : ఎవరినీ నమ్మకు.. కక్షకట్టకు.. బండ్ల గణేష్ ట్వీట్లు పవన్ కళ్యాణ్ గురించేనా?

Bandla Ganesh Tweets బండ్ల గణేష్‌ ట్విట్టర్‌లో వేసే ట్వీట్లు ఎప్పుడూ కాంట్రవర్సీకి దారి తీస్తూనే ఉంటాయి. ఎందుకు అలా ట్వీట్లు వేస్తాడు.. ఏ ఉద్దేశంలో వేసి ఉంటాడు.. ఎవరిని ఉద్దేశించి అని ఉంటాడు అనేది కూడా చెప్పలేం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 05:32 PM IST
  • ట్విట్టర్‌లో బండ్ల గణేష్‌ దూకుడు
  • కాంట్రవర్సీ ట్వీట్లతో బండ్లన్న రచ్చ
  • పవన్ కళ్యాణ్‌తో గొడవలే కారణమా?
Bandla Ganesh : ఎవరినీ నమ్మకు.. కక్షకట్టకు.. బండ్ల గణేష్ ట్వీట్లు పవన్ కళ్యాణ్ గురించేనా?

Bandla Ganesh Controversial Comments బండ్ల గణేష్‌ ట్విట్టర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే తనకు చేతనైనంత హెల్ప్ చేస్తాడు. అలా బండ్ల గణేష్‌ వేసే ట్వీట్లు మాత్రం ఫ్యాన్స్‌లో గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంటాయి. బండ్ల గణేష్‌ను ఫాలో అయ్యే వారిలో ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ అభిమానులే ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా ఆరాధించే భక్తుల్లో బండ్ల గణేష్‌ ముందుంటాడు.

కానీ గబ్బర్ సింగ్ రెమ్యూనరేషన్ విషయంలో బండ్ల గణేష్ చేసిన విషయాలు, తాను అనుకున్నంతగా ఇవ్వలేదంటూ పవన్ కళ్యాణ్‌ చెప్పడంతో కాస్త దూరం పెరిగినట్టుగా అనిపిస్తోంది. ఎప్పటికీ తన దేవుడు పవన్ కళ్యాణ్ అని, ఆయనతో తనకు శత్రుత్వం ఉండదని చెబుతూ వస్తున్నాడు. కానీ బండ్ల గణేష్‌ వేస్తోన్న ట్వీట్లు మాత్రం వెరైటీగా ఉన్నాయి. ఎప్పుడూ లేనిది రవితేజను ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేశాడు.

ఇక బండ్ల గణేష్‌ వేస్తోన్న ట్వీట్లు ఓ పట్టాన ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఇప్పుడు బండ్ల గణేష్‌ వేసిన ట్వీట్ చూస్తే ఎవరి చేతిలోనే బాగానే మోసపోయినట్టుగా తెలుస్తోంది. ఆయన వేసిన ఈ కొటేషన్లు ఇప్పుడు అందరినీ ఆలోచనల్లో పడేస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన కామెంట్లు చేశాడా? అనేలా ఉన్నాయి.

 

ప్రతిసారి మోసపోవు కదా మరెందుకు అలా కూలబడిపోయావు..? లే.. ఈసారి ఎవరిని నమ్మకు అలాగని అందరి మీద కక్షకట్టకు జీవితం కదా..! ఒకేలా సాగిపోదు ఎన్నో ఎదురవుతాయి మరెన్నో నేర్పుతాయి.. వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్లడమే ఆట..! గెలుస్తావా.. ఓడిపోతావా తర్వాత, కానీ ఆట మధ్యలో ఆగిపోకు చివరి వరకు ఉండు. నీ ఓపిక రేపటి భవిష్యత్తుకి బలం అంటూ బండ్ల గణేష్‌ ట్వీట్ వేశాడు.

Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే

Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News