Bharateeyudu 2 2days collections:‘భారతీయుడు 2’ 2వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు.. రెండో రోజు సగానికి సగం తగ్గిన కలెక్షన్స్..

Bharateeyudu 2 2days collections: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 14, 2024, 02:41 PM IST
Bharateeyudu 2 2days collections:‘భారతీయుడు 2’ 2వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు.. రెండో రోజు సగానికి సగం తగ్గిన కలెక్షన్స్..

Bharateeyudu 2 2days collections: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 1996లో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే కదా. ఈ సినిమాకు  సీక్వెల్ గా దాదాపు 28 యేళ్ల తర్వాత భారతీయుడు 2తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు శంకర్. ఈ సినిమాను కేవలం భారతీయుడు బ్రాండ్ తోనే తెరకెక్కించాడు. కథ లేకుండా.. కేవలం భారతీయుడు బ్రాండ్ తో  కొన్ని సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శంకర్.

తను ప్రయాణించే రైలు జీవిత కాలం లేటు అన్నట్టు.. ఏదో 1998 లేదా 2000లో తీయాల్సిన భారతీయుడు 2’ చిత్రాన్ని జీవితం కాలం లేటు అన్నట్టు ఎపుడో ఔట్ డేటెట్ కంటెంట్ తో ఈ సినిమాను తాజాగా కమల్ హాసన్ తో తెరకెక్కించాడు దర్శకుడు. భారతీయుడు లో కూతురు సెంటిమెంట్ అనే ఎమోషన్ తో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. కానీ ‘భారతీయుడు 2’ లో అలాంటి ఎమోషన్ తో కూడిన సన్నివేశాలు ఏమి లేవు. ఇన్నేళ్లలో మన దేశంలో ఏమి మారలేదనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేసాడు శంకర్.

శంకర్ తెరకెక్కించిన భారతీయుడు, అపరిచితుడు సినిమాల తాలూకు ఛాయలే కనిపించాయి. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సీన్స్ ఏమి లేవు. పైగా వందేళ్ల తర్వాత కూడా తాతగా కమల్ హాసన్ ఎంట్రీ ఏమంత ఎఫెక్ట్ గా లేదు. మొత్తంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు దాదాపు రూ. 6.75 కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు దారుణంగా రూ. 2.88 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ సినిమా 9.63 కోట్ల షేర్ (రూ. 15.70 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ రోజు భారతీయుడు 2 సినిమా ఏ మేరకు రాబడుతుందో చూడాలి. అంతేకాదు ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ తో ఈ సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించారు. మరోవైపు ఈ సినిమా తొలి రోజు రూ. 58.10 కోట్ల గ్రాస్ వసూళ్లతో 2024లో మన దేశంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో  టాప్ 3లో నిలవడం విశేషం.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.50 కోట్ల షేర్ (రూ. 87.30 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. రూ. 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘భారతీయుడు 2’ ప్రపంచ వ్యాప్తంగా .. రూ. 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 129.50 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా  ఈ సినిమాకున్న టాక్ ను బట్టి ఈ సినిమా ఫుల్ రన్ లో  ఏ మేరకు నష్టాలను తీసుకొస్తుందో చూడాలి. ఈ రోజు ఈ సినిమా ఏ మేరకు రాబడుతుందో అదే ఫైనల్ కలెక్షన్స్ అని చెప్పాలి. సోమ వారం నుంచి ఈ సినిమా వచ్చే వసూళ్లను బట్టి ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందనేది చూడాలి.

ఈ సినిమా తెలుగులో దాదాపు  రూ. 24 కోట్ల షేర్ రాబడితే హిట్ అనిపించుకుంటుంది. రూ. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 9.63 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ దగ్గర రూ. 15.37 కోట్ల షేర్ రాబడితే..హిట్ అనిపించుకుంటుంది. ఈ సినిమా టాక్ ను బట్టి ఇక ఈ సినిమా కోలుకోవడం కష్టమే అని చెప్పాలి.

Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News