Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్స్ పై ఓ రేంజ్ లో నాగార్జున ఫైర్.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ ముద్దుబిడ్డ...

BB 7 Telugu: శనివారం హౌస్ మేట్స్ అందరికీ ఇచ్చి పడేశాడు నాగార్జున. ఒక్కొక్కరి తప్పులను ఎండగడుతూ అదిరిపోయే హోస్టింగ్ చేశారు నాగ్. ముఖ్యంగా అమర్, శోభాశెట్టి, శివాజీ, యావర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2023, 12:33 PM IST
Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్స్ పై ఓ రేంజ్ లో నాగార్జున ఫైర్.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ ముద్దుబిడ్డ...

Bigg Boss 7 Telugu Updates: తెలుగు బిగ్ బాస్ తుది దశకు చేరుకునే కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. శనివారం నాగార్జున వచ్చి రాగానే హౌస్ మేట్స్ కు ఓ రేంజ్ క్లాస్ పీకారు. ఒక్కొక్కరి తప్పులు ఎత్తిచూపుతూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా శోభాశెట్టి, శివాజీ, యావర్, అమర్ పై విరుచుకుపడ్డారు. దీంతో కంటెస్టెంట్ల నోట మాట రాలేదు. అర్జున్, ప్రియాంక బాగా ఆడారని కింగ్ మెచ్చుకున్నారు. శనివారం ఎపిసోడ్ లో పెట్టిన టాస్క్ లో ప్రియాంక గెలిచి మెుదటి ఫిమేల్ కంటెస్టెంట్ గా ఓటు అప్పీల్ ను చేసింది. 

ప్రియాంక, అర్జున్ తప్ప మిగతావారిలో ఒక్కొక్కరిని కన్ఫేషన్ రూముకు పిలిచి ప్రశ్నించారు నాగార్జున. మెుదట శోభా ఫోటోను పగలగొట్టి కన్ఫేషన్ రూమ్ కు పిలిచారు కింగ్. శివాజీ గురించి మెుత్తం చెప్తావ్ అన్నావ్ కదా అదేంటో చెప్పు అమ్మ అని నాగ్ అడిగారు. ఆయన మెుదటి నుంచి ఫేవరిజం అంటున్నారని, కావాలనే టార్గెట్ చేస్తున్నారని శోభా వివరించింది. మరి ఫన్ టాస్కులో సంచాలకురాలైన నువ్వు డైరెక్ట్ గా ప్రియాంకకు సపోర్టు చేస్తానని చెప్తే ఎవరైనా అలాగే అంటారని కింగ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో శోభా నోట మాటరాలేదు. యావర్ విషయంలోనూ అలాగే చేశావని శోభాకు ఇచ్చిపడేశారు.

ఆ తర్వాత కన్ఫేషన్ రూమ్ కు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను పిలిచారు. ఆటలో చిన్నగాయమైతే గోల గోల చేస్తూ... వీడియోలు చూపించమనడం కరెక్టే కాదని ప్రశాంత్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. అనంతరం యావర్ ను పిలిచి.. చీ, తూ అనడం కరెక్టేనా అంటూ నిలదీశారు. శోభా రెచ్చగొట్టడం వల్ల అలా ప్రవర్తించానని సంజాయిషీ ఇచ్చాడు యావర్. 

మరోవైపు శివాజీతో వాడీవేడీగా చర్చ జరిగింది. మా ఇంట్లో ఆడపిల్లలు అయితే పీక మీద కాలేసి తొక్కుతాననడం కరెక్టేనా అని శివాజీని అడిగారు నాగ్. తాను అలా చేస్తానని సమర్థించుకున్నాడు శివాజీ. దీంతో నాగార్జున ఫైర్ అయ్యాడు. మెుదటి నుంచి కామన్ మ్యాన్ గా వచ్చిన ప్రశాంత్ ను టార్గెట్ చేస్తున్నారని శివాజీ అనగా అది బిగ్ బాస్ చూస్తున్నాడని కౌంటర్ ఇచ్చాడు. అయితే నువ్వు అమ్మాయిలను అలా అనడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు కింగ్. నేను అలాంటి మాటలంటే సారీ చెబుతానని చెప్పాడు శివాజీ. 

Also read: Sandeep Reddy Vanga: చిరంజీవితో సినిమాకి సై అంటున్న సందీప్ రెడ్డి.. మెగాస్టార్ ఎస్ అంటారా..?

మరోవైపు అమర్ ను కడిగిపారేశాడు నాగార్జున. ప్రశాంత్ విషయంలో అమర్ చేసిన పనిని తప్పుబట్టారు. ప్రశాంత్ ను రెచ్చగొట్టడం, ఆటను చెడగొట్టడం, అతడిని తోసుకుంటూ మెడికల్ రూముకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదని అన్నారు నాగ్. నీ బిహేవియేర్ సైకోలా ఉందని జనాలు అంటున్నారని నాగార్జున చెప్పాడు. దీంతో చేసేది ఏమీ లేక అమర్ తన తప్పులను ఒప్పుకున్నాడు. 

Also Read: Animal: గీతాంజలి స్ట్రాంగ్ అండ్ రా.. నా వరకు ఆ పాత్ర ఎంతో గొప్పది: రష్మిక మందాన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News