EMI Ammayi Trailer : బిగ్ బాస్ గ్యాంగ్ అంతా కలిసి వస్తున్నారే.. భాను శ్రీ పాత్రే కీలకం

EMI Ee Ammayi Trailer బిగ్ బాస్ గ్యాంగ్ అంతా కలిసి ఓ సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. ఈఎంఐ ఈ అమ్మాయి అంటూ రాబోతోన్న చిత్రంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లే ఎక్కువగా కనిపించారు. ఇలా బిగ్ బాస్ రీ యూనియన్‌లా ఈ సినిమా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 09:15 AM IST
  • బిగ్ బాస్ కంటెస్టంట్లతో సినిమా
  • ఈఎంఐ ఈ అమ్మాయి ట్రైలర్
  • జంటగా కనిపించి భాను శ్రీ, నోయల్
EMI Ammayi Trailer : బిగ్ బాస్ గ్యాంగ్ అంతా కలిసి వస్తున్నారే.. భాను శ్రీ పాత్రే కీలకం

EMI Ee Ammayi Trailer బిగ్ బాస్ షోలో భాను శ్రీ, నోయల్, మహేష్‌ విట్టా, చలాకీ చంటి, ధన్ రాజ్, సమీర్ ఇలా చాలా మంది సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరంతా కలిసి ఈఎంఐ ఈ అమ్మాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. దొంతు బుచ్చయ్య , బమ్మిడి సంగీత సమర్పణలో  శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై దొంతు రమేష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డి. రమేష్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ నెల 10న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఇదేదో కాల్ మనీ, వ్యభిచార వ్యవస్థ చుట్టూ అల్లిన కథలా కనిపిస్తుంది. ఈఎంఐ పద్దతి అంటూ ఏదో కొత్తగా ట్రై చేసినట్టుగా కనిపిస్తోంది. ఇక ఇది సస్పెన్స్ థ్రిల్లర్‌ జానర్‌ అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో మహేష్‌ విట్టా, ధన్ రాజ్ చేసిన కామెడీ వర్కౌట్ అయ్యేలా ఉంది.

ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో.. నటులు  టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో .సినిమా చాలా బాగా వచ్చిందని సమర్పకులు దొంతు బుచ్చయ్య అన్నారు. డైరెక్టర్ దొంతు రమేష్  మాట్లాడుతూ.. కరోనా టైంలో  ఈ సినిమా కొరకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినా కూడా మా నాన్న అండగా నిలబడి సినిమాను పూర్తి చేశారని చెప్పుకొచ్చాడు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News