Bigg Boss 14: రోడ్డు ప్రమాదంలో మరణించిన టాలెంట్ మేనేజర్ పిస్తా ధాకడ్

Bigg Boss 14: బుల్లితెరపై దేశంలో పాపులర్ షో బిగ్‌బాస్. హిందీలో బిగ్‌బాస్ సీజన్ 14 నడుస్తోందిప్పుడు. ఇప్పుడీ షోలో విషాదం చోటుచేసుకుంది. టాలెంట్ మేనేజర్ పిస్తా ధాకడ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.

Last Updated : Jan 16, 2021, 10:41 PM IST
Bigg Boss 14: రోడ్డు ప్రమాదంలో మరణించిన టాలెంట్ మేనేజర్ పిస్తా ధాకడ్

Bigg Boss 14: బుల్లితెరపై దేశంలో పాపులర్ షో బిగ్‌బాస్. హిందీలో బిగ్‌బాస్ సీజన్ 14 నడుస్తోందిప్పుడు. ఇప్పుడీ షోలో విషాదం చోటుచేసుకుంది. టాలెంట్ మేనేజర్ పిస్తా ధాకడ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.

దేశవ్యాప్తంగా  టీవీ తెరను ఏలుతున్న బిగ్‌బాస్ ( Bigg Boss ) హిందీ షోలో విషాదం  చోటుచేసుకుంది. బిగ్‌బాస్ హిందీ ( Bigg Boss Hindi show ) షోకు గత కొన్నేళ్లుగా టాలెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల పిస్తా ధాకడ్ ( Pista Dhakad ) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం..కలకలం రేపుతోంది. యూనిట్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. వీకెండ్ ఎపిసోడ్ పూర్తి చేసుకుని అసిస్టెంట్‌తో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా బండి స్కిడ్ అయి పడిపోయారు. అదే సమయంలో అట్నుంచి వస్తున్న వ్యానిటీ వ్యాన్ మీద నుంచి దూసుకెళ్లిపోయింది. టాలెంట్ మేనేజర్ పిస్తా ధాకడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా...అసిస్టెంట్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

చిన్న వయస్సులో ప్రాణాలు కోల్పోవడంతో యూనిట్ అంతా విషాదంలో మునిగిపోయింది. పిస్తా ధాకడ్ మరణం ( Pista Dhakad dies ) పై సినీ ప్రముఖులు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు, బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ ( Salman khan ) సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. 

Also read: Army Day: జ‌వాన్ల‌తో వాలీబాల్ ఆడిన అక్ష‌య్ కుమార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News