zookeepers enters lions cage video viral: చాలా మంది తమ లవర్ ముందు హీరోయిజం చూపించుకోవాలనుకుంటారు. దీనికోసం వెరైటీ పనులు చేసి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కొందరు తమ లవర్స్ కు ఏదైన గిఫ్ట్ లు ఇచ్చి ఆనందపరుస్తుంటారు. మరికొందరు కొత్త ప్రదేశాలలోకి తీసుకెళ్లి సర్ ప్రైజ్ చేస్తుంటారు. తమ ప్రియురాలికి ఇష్టమైన ఫుడ్ లేదా ఆమెమనస్సుకు నచ్చే పనులు చేసి తన దగ్గర మార్కులు కొట్టేసేందుకు రకరకాల ప్లాన్ లు వేస్తుంటారు.
ఏదీ చేసిన తాము ప్రాణంగా ప్రేమించిన.. అమ్మాయిల కళ్లలో ఆనందం కోసం ఎంతకైన తెగిస్తారని చెప్పుకొవచ్చు. కొన్నిసార్లు ప్రాణాలు ఇవ్వడానికి లేదా ప్రాణాలు తీసేందుకు కూడా భగ్న ప్రేమికులు వెనుకాడరని చెప్పుకొవచ్చు.
Un trabajador de un zoológico de Uzbekistán entró en la jaula de los leones y se lo devoraron.
Quería enviarle el video a su novia ... pic.twitter.com/rR6assw26D— Isaac (@isaacrrr7) January 2, 2025
ఈ క్రమంలో ఒక వ్యక్తి తన లవర్ ను వెరైటీగా సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నారు. తన దైర్యమేంటో ఆమెకు చూపాలని అనుకున్నాడు. ఉజ్బెకిస్తాన్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఉజ్బెకిస్తాన్ లోని పార్కెంట్ లో ఒక జూ ఉంది. అందులో ఇరిస్కులోవ్ జూకీపర్ గా పనిచేస్తున్నారు. ఆ జూలో అనేక క్రూర జంతువులు ఉన్నాయి. అయితే.. అతగాడు తన రెంజ్ ఏంటో ప్రియురాలికి చూపించాలని అనుకున్నట్లున్నాడు. ఏకంగా సింహల బోనులోకి ప్రవేశించాడు. అప్పటికే దాంట్లో మూడు సింహలు ఉన్నట్లు తెలుస్తొంది. అతను.. సింబా.. అంటూ.. సింహాలను చూస్తు వాటి దగ్గరకు వీడియో రికార్డు చేస్తు వెళ్లాడు.
అది రాత్రిపూట కావడంతో అక్కడున్న వారు ఎవరు కూడా అంతగా గమనించలేదని తెలుస్తొంది. ఈ క్రమంలో అతను సింహాల దగ్గరకు వెళ్లడంతో అవి కాసేపు మనోడీ వేశాలను చూసి.. ఒక్కసారిగా దూకీ చీల్చి చేండాడాయి. అతను ఈ షాకింగ్ పరిణామంలో అరుస్తూ.. కేకలు వేశాడు.
ఈ వీడియో సైతం.. అతని ఫోన్ లో రికార్డు అయినట్లు తెలుస్తొంది. సింహాలు అతనిపై దాడిచేసి చంపేసినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత సింహాలు..జూలో బైట కూడా సంచరించాయంట. ఈ క్రమంలో జూ సిబ్బంది గమనించి.. మరల సింహాన్ని బంధించారంట. తాజాగా.. ఈ వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తొంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter