Bigg Boss Season 7 Latest Updates: ఓ సామీ తలుపు తీయు.. నేను పోతా.. బిగ్‌బాస్‌పై శివాజీ ఫైర్

Bigg Boss Telugu Latest Promo: బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు శివాజీ. తాను బయటకు పంపిస్తే.. వెళ్లిపోతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బొక్కలోదంటూ చిర్రుబుర్రులాడాడు.

Written by - Ashok Krindinti | Last Updated : Sep 7, 2023, 03:20 PM IST
Bigg Boss Season 7 Latest Updates: ఓ సామీ తలుపు తీయు.. నేను పోతా.. బిగ్‌బాస్‌పై శివాజీ ఫైర్

Bigg Boss Telugu Latest Promo: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు శివాజీ తనదైన శైలిలో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో శివాజీనే ముందున్నాడు. అయితే తలుపులు తీయండి సామీ.. నేను బయటకు వెళ్లిపోతా.. అంటూ శివాజీ అనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకు శివాజీ కోపానికి కారణం ఏంటి..? ఎందుకు బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతానని అంటున్నాడు..?

బిగ్‌బాస్‌ షోలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాఫీ కోసం బిగ్‌బాస్ శివాజీకి పెద్ద పరీక్షే పెట్టాడు బిగ్‌బాస్‌. నాలుగు రోజులుగా కాఫీ లేకపోవడంతో శివాజీ బిగ్‌బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాఫీ పంపవయ్యా.. బొక్కలోదంటూ చేతిలో ఉన్న ప్లేటు విసిరి కొట్టాడు. కాఫీ లగ్జరీ బడ్జెట్ అని ఓ కంటెస్టెంట్ అనగా.. బొక్కలో బడ్జెట్ అంటూ తీసిపారేశాడు. కోపంతో బకెట్‌ను కాలితో తన్నేశాడు. గంట చూస్తామ్మా.. బొక్క కూడా భయపడనంటూ స్పష్టం చేశాడు.

బీపీ చెకింగ్ మిషన్ పంపించిన బిగ్‌బాస్.. శివాజీ బీపీ చెక్ చెప్పాలని గౌతమ్‌కు సూచించాడు. ఏం చేస్తావు తమ్ముడు బీపీ.. పెట్టేయ్ అక్కడ అంటూ ఫైర్ అయ్యాడు. తాను చాలా కిందకు ఉంటానని.. తనను రెచ్చగొడితే పగలగొట్టిపోతానని చెప్పాడు. "తలుపు తీయు.. ఒక్క నిమిషం ఉంటే అప్పుడు అడుగు. నేను ఇక్కడ బాధపడితే ఆయన (బాగ్‌బాస్‌)కు కామెడీగా ఉంది. అందరినీ చూసి.. శివాజీని వదిలేసి కామెడీ ఫెలోను చేయాలని చూస్తున్నాడా..? ఓ సామీ తలుపు తీయు సామీ.. నేను పోతా.. నాకొద్దు.. తలుపుతీయు.." అంటూ శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫుల్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో క్లారిటీ రానుంది.

Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  

Also Read: Leopard Trap Bone At Tirumala: భక్తుల భద్రత విషయంలో రాజీ లేదు.. టీడీడీ ఛైర్మన్ కీలక ప్రకటన  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x