Vishwak Sen: వామ్మో ఏందిది.. అమ్మాయిగా మారనున్న హీరో విశ్వక్‌ సేన్‌

Vishwak Sen Birth Day New Movies Launch: సొంత ప్రతిభతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తెలంగాణ హీరో విశ్వక్‌ సేన్‌ వరుస సినిమాలతో టాప్‌ హీరోగా ఎదుగుతున్నాడు. త్వరలోనే అతడు అమ్మాయిగా మారనున్నాడట. ఈ వార్త ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 29, 2024, 08:56 PM IST
Vishwak Sen: వామ్మో ఏందిది.. అమ్మాయిగా మారనున్న హీరో విశ్వక్‌ సేన్‌

Vishwak Sen: దర్శకత్వంతోపాటు సినీ నటుడిగా 'ఫలక్‌నుమ దాస్‌' సినీ పరిశ్రమలో ప్రవేశించి విశ్వక్‌ సేన్‌ తనకంటూ ప్రత్యేక సినిమాలు చేస్తూ హీరోగా, దర్శకుడిగా ఎదుగుతున్నాడు. ఇటీవల 'గామి' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విశ్వక్‌ తన పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలను ప్రకటించాడు. మార్చి 29 శుక్రవారం విశ్వక్‌ సేన్‌ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా రెండు సినిమాలు ప్రకటించగా వాటిలో ఒకటి చాలా చాలా ప్రత్యేకంగా. ఆ సినిమా కోసం విశ్వక్‌ ఓ సాహసం చేస్తున్నాడు.

Also Read: Vijay Deverakonda: ప్రేమ పెళ్లి చేసుకుంటా.. నాకు తండ్రిని కావాలని ఉంది: విజయ్‌ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

మొదటి సినిమా 'మెకానిక్‌ రాకీ' కాగా.. రెండోది 'లైలా'. ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకమని టైటిళ్లను చూస్తుంటే తెలుస్తోంది. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ మహిళ పాత్రలో మెరుస్తున్నాడని తెలిసింది. సాహూ గారపాటి నిర్మాణంలో షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌లో ఈ సినిమా రాబోతున్నది. విశ్వక్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్‌ వీడియోను విడుదల చేశారు. వీడియోలో 'లైలా' ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించారు. అందులో మహిళా అలంకరణకు సంబంధించిన అద్దం, లిప్‌స్టిక్‌, మేకప్‌ కిట్‌, పువ్వులు తదితర వాటిని చూపిస్తూ చిత్రబృందాన్ని పరిచయం చేశారు.

Also Read: Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్‌ చూస్తే నవ్వులే

అతడు అని రాసి ఉన్న రాసున్న దాన్ని చెరిపేసి ఆమె ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం అని  వీడియోలో ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అబ్బాయి కాస్త అమ్మాయిగా మారనున్నాడని అర్థం. ఈ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరో ప్రత్యేకమైన సినిమాతో విశ్వక్‌ వస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే గామి సినిమాలో ఎవరూ ఊహించని పాత్రలో కనిపించిన విశ్వక్‌ ఇప్పుడు అమ్మాయి పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. విశ్వక్‌ జోడీగా ఆకాంక్ష శర్మ నటిస్తుండగా ఈ సినిమాకు తనీష్‌ బగ్చీ సంగీతం అందిస్తున్నాడు. ప్రయోగాలను ఎప్పుడూ ప్రోత్సహించే విశ్వక్‌ ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  సరికొత్త సినిమాలతో వస్తున్న విశ్వక్‌ సేన్‌ మరిన్ని విజయాలు పొందాలని జీ ఆకాంక్షిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x