Tanushree Dutta Accident: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ బాలకృష్ణ హీరోయిన్.. మోకాలికి తీవ్ర గాయం!

Tanushree Dutta Car accident way to Ujjain Mahakaal temple. బాలీవుడ్‌ హీరోయిన్ తనుశ్రీ దత్తా తృటిలో పెను రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2022, 01:07 PM IST
  • పెను ప్రమాదం నుంచి బయటపడ్డ తనుశ్రీ దత్తా
  • తనుశ్రీ దత్తా మోకాలికి తీవ్ర గాయం
  • కారు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో
Tanushree Dutta Accident: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ బాలకృష్ణ హీరోయిన్.. మోకాలికి తీవ్ర గాయం!

Bollywood Actress Tanushree Dutta escapes from Car accident: బాలీవుడ్‌ హీరోయిన్ తనుశ్రీ దత్తా తృటిలో పెను రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళవారం తనుశ్రీ దత్తా కారు ప్రమాదానికి గురయ్యింది. ఉజ్జయిని మహాకలేశ్వర్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని తనుశ్రీ దత్తా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన మోకాలి అయిన గాయం ఫొటోను సైతం షేర్‌ చేశారు.

కారు ప్రమాదంలో తనుశ్రీ దత్తా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డు ప్రమాదంలో గాయపడినా.. ఆమె ఉజ్జయిని ఆలయానికి దర్శనం కోసం వెళ్లడం విశేషం. ప్రమాదం అనంతరం తనుశ్రీ తన మోకాలికి కాస్త కింద అయిన గాయానికి కుట్లు వేయించుకుని మరీ.. ఉజ్జయిని మహాకలేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం గుడిలో ఫొటోలు దిగారు. అభిమానులతో కూడా సెల్ఫీలకు పోజులిచ్చారు. ఇందుకు సంబందించిన పోటోలను తనుశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. 

ఉజ్జయిని ఆలయ దర్శనం అనంతరం తనుశ్రీ దత్తా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు. 'ఈరోజు నాకు ఓ సాహసోపేతమైన రోజు. కానీ చివరకు మహాకాళ దర్శనానికి వచ్చాను. గుడికి వెళ్లే మార్గంలో ఘోర కారు ప్రమాదం జరిగింది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నా మోకాలికి కొన్ని కుట్లు పడ్డాయి. జై శ్రీ మహాకాళ' అని తనుశ్రీ దత్తా పేర్కొన్నారు. ప్రస్తుతం తనుశ్రీ గాయంకు సంబందించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial)

బాలీవుడ్ కిసింగ్ హీరో ఇమ్రాన్ హష్మీ సరసన 'ఆషిక్ బనాయా ఆప్నే'తో తనుశ్రీ దత్తా సినిమాల్లోకి అడుగుపెట్టారు. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. తెలుగులో బాలకృష్ణతో 'వీరభద్ర' సినిమాలో నటించారు. తెలుగులో ఆమె చేసిన ఏకైక సినిమా ఇదే. ఇక 2018లో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమానికి తెరలేపి బాగా పాపులర్ అయ్యారు. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరమైన తనుశ్రీ..   సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. ఈ అమ్మడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

Also Read: నీ ఇంటికొస్తా, నట్టింటికొస్తా.. నీ కళ్ల ముందే నీ కూతురితో మాట్లాడతా! జయమ్మ పంచాయతీ భలేగుందే

Also Read: Livingstone Six: బాప్‌రే.. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో భారీ సిక్సర్‌! లివింగ్‌స్టోన్ బ్యాట్ చెక్ చేసిన రషీద్ ఖాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News