Boycott Tension to Liger: వారంలో విడుదలనగా లైగర్ టీంకి కొత్త టెన్షన్.. !

Boycott Tension to liger Movie team: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ ఆగస్టు 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా యూనిట్ కు బాయ్ కాట్ టెన్షన్ పట్టుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 11:57 AM IST
Boycott Tension to Liger: వారంలో విడుదలనగా లైగర్ టీంకి కొత్త టెన్షన్.. !

Boycott Tension to liger Movie team: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం లైగర్. పూర్తిస్థాయి కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. అలాగే సినిమాను మరో మూడు భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పుడు సినిమా మరో వారంలో విడుదల కాబోతోన్న క్రమంలో సినిమా యూనిట్ కి కొత్త టెన్షన్ పట్టుకుంది. అదేమంటే ఇప్పటికే బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ బలంగా నడుస్తోంది.

గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత ఈ ట్రెండ్ బలంగా వినిపించింది. బాలీవుడ్ హీరోలు ఎవరూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం విషయంలో సంతాపం వ్యక్తం చేయలేదని, అలాగే ఆయన మరణానికి బాలీవుడ్ హీరోలు కరణ్ జోహార్ వంటి నెపోటిజంను ప్రోత్సహించే దర్శకనిర్మాతలే అంటూ కొంతమంది నెటిజెన్లు బాలీవుడ్ ను బాయ్ కట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ మధ్య విడుదలైన లాల్ సింగ్ చడ్డా సినిమా విషయంలో కూడా అది నిరూపితం అయింది. గతంలో పీకే సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సీన్లు చూపించారని అలాగే ఈ దేశంలో తనకు రక్షణ లేదని అమీర్ ఖాన్ కామెంట్స్ చేశాడని చెబుతూ ఆ సినిమాను  బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమా విషయంలో కూడా అదే కామెంట్స్ వినిపించాయి. ఈ  బాయ్ కాట్ ట్రెండ్ దెబ్బకు సినిమాకి కలెక్షన్స్ కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత అతని మరణానికి కారణం కరణ్ జోహార్ వంటి దర్శక నిర్మాతలు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. కరణ్ జోహార్ బయట నుంచి వచ్చిన వారిని ప్రమోట్ చేయకుండా కేవలం సినీ పరిశ్రమలో పాతుకుపోయిన వారి పిల్లలను ప్రమోట్ చేస్తున్నారనే విషయం మీద పెద్ద ఎత్తున నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇలాంటి వారి వల్లే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి టాలెంట్ ఉన్నవారు కూడా నిరూపించుకో లేకపోతున్నారు అంటూ అప్పట్లో ట్రోల్స్ జరిగాయి.

ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ సహ నిర్మాణంలో రూపొందిన లైగర్ సినిమాను బ్యాన్ చేయాలంటూ బాలీవుడ్లో ప్రచారం మొదలు పెట్టడంతో ఈ సినిమా యూనిట్ లో టెన్షన్ నెలకొంది. ఈ సినిమాను కరణ్ జోహార్ సహ నిర్మించడంతో పాటు ఆయన హీరోయిన్ గా ప్రమోట్ చేసే అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్గా నటించడంతో బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ ఈ సినిమాకి టెన్షన్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా ఇదే విషయం మీద పూరీ జగన్నాథ్ కూడా స్పందించారు.

అసలు ఈ ట్రెండ్ ఎవరు సృష్టిస్తున్నారో తెలియడం లేదని, మేము సినిమాలు చేసినా కథలు రాసుకున్నా అవన్నీ జనాన్ని ఎంటర్టైన్ చేయడం కోసమే అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ బాయ్ కట్ అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలియడం లేదు, ఇది సినీ పరిశ్రమకు కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మొత్తం మీద సినిమా యూనిట్ అయితే బాయ్ కాట్ ట్రెండ్తో ఇప్పుడు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. మరి ఈ ట్రెండ్ పూర్తిస్థాయిలో కనుక జరిగితే లైగర్ సినిమాకి ఇబ్బందులు తప్పవని విలేషకులు చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది. 
Also Read: iBOMMA Shock to Indian Users: యూజర్లకు షాకిచ్చిన ఐబొమ్మ.. ఏమైందంటే?

Also Read: Mahesh Babu Trivikram Movie Release: ఆ డేట్లు కాదనుకుని మరీ వెనక్కు.. లాజిక్కేమిటో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News