MAA Elections 2021: షాకిచ్చిన బండ్ల గణేష్.. నామినేషన్ తిరస్కరించుకున్న నిర్మాత

రసవత్తరంగా జరుగుతున్న 'మా' ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా  జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న నిర్మాత బండ్ల గణేష్ అనూహ్యంగా నామినేషన్ వెనక్కి తీసుకొని, ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2021, 03:58 PM IST
  • నామినేషన్ వెనక్కి తీసుకున్న బండ్ల గణేష్
  • ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటన
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బండ్ల గణేష్
MAA  Elections 2021: షాకిచ్చిన బండ్ల గణేష్.. నామినేషన్ తిరస్కరించుకున్న నిర్మాత

 Movie Artists Association Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(MAA) ఎన్నికలు రోజు రోజుకు మలుపులు తిరుగుతున్నాయి. మా ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే.. పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్(Praksh Raj), మంచు విష్ణు (Manchu Vinshu Panel) ప్యానల్స్ పరస్పరం విమర్శలు, ప్రశ్నలను  సందించుకుంటున్నారు. 

తాజాగా నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) దాఖలాలు చేసిన నామినేషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, "నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను" అంతేకాకుండా నా మద్దతు  ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు (Prakash Raj Panel) ఉంటుందని ట్వీట్ చేసాడు. 

Also Read: Python Sleeps in Lap of Girl: వణుకు పుట్టిస్తున్న వీడియో.. చిన్నారి ఒళ్లో 20 అడుగుల భారీ కొండచిలువ

నిజానికి మొదటగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఉన్న బండ్ల గణేష్ అకస్మాత్తుగా ప్యానెల్ నుండి తప్పుకొని, ఇండిపెండెంట్ గా బరిలోకియ దిగారు. తనను జనరల్ సెక్రటరీగా ఎంచుకోవాలని వినూత్న ప్రచారం చేసిన ఆయన ఇపుడు మళ్లీ నామినేషన్ వెనక్కి తీసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. నామినేషన్ వెనక్కి తీసుకోవటం తిరిగి ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు తెలపటం... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారిలో అనుమానాలకు తావితీస్తుంది. 

అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ (Prakash Raj), మంచు విష్ణు (Manchu Vishnu) ఇప్పటికే తమ ప్యానల్ ప్రకటించి, నామినేషన్ లు వేసి, ప్యానల్ ప్రకటన చేసి ప్రచారంలో బిజీగా ఉన్నారు. నటుడు సీవీఎల్ కూడా నామినేషన్ వేసి తనదైన రీతిలో ప్రచారం ప్రారంభించారు. 

Also Read: Huzurabad by election: హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు ప్రారంభం..తొలిరోజే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ నామినేషన్‌ దాఖలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఎవరికీ పీఠం అప్పజెప్పుతారో మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

  

Trending News