Breaking News: సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు గారు కన్ను మూసారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు కొద్దీ సేపటి కింద తుది శ్వాస విడిచారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 10:51 PM IST
Breaking News: సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి

Supar Star Mahesh Babu Brother Ramesh babu is no More: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (Ramesh Babu) గారు కన్ను మూసారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు కొద్దీ సేపటి కింద తుది శ్వాస విడిచారు. 

కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు గారు చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో (Gachibowli AIG Hospital) తీసుకెళ్తుండగా.. దారి మధ్యలో మరణించినట్లు సమాచారం. 

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) పెద్ద కూమారుడు రమేష్ బాబు పలు సినిమాల్లో నటించి మెప్పించారు. సామ్రాట్ (Samrat Movie) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కాగా.. పలు సినిమాల్లో నటించినప్పటికీ రాణించని రమేష్ బాబు ఇక సినిమాలకు దూరంగా ఉన్నారు. 

ముగ్గురు కొడుకులు (Mugguru Kodukulu), కృష్ణ గారి అబ్బాయి (Krishna Gari abbai), చిన్ని కృష్ణుడు (Chinni Krishnudu) మరియు ఎంకౌంటర్ (Encounter) లాంటి పలు సినిమాల్లో నటించారు. అంతేకాకుండా, సూపర్ స్టార్ కృష్ణ నటించి సూపర్ హిట్ అయిన "అల్లూరి సీతారామరాజు" (Alluri Seetharamaraju) సినిమాలో చిన్నప్పటి అల్లూరిగా నటించి మెప్పించారు.  

అంతేకాకూండా రమేష్ బాబు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. మహేష్ బాబు నటించిన అథితి, అర్జున్, ఆగడు, మరియు దూకుడు వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. 

రమేష్ బాబు మృతితో సూపర్ స్టార్ ఇంట్లో విషాదం నెలకొనగా.. కరోనాతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న మహేష్ బాబు, రమేష్ బాబు పార్థివ దేహాన్ని చూడటానికి వస్తారా.. ? లేదా..? అన్నది చూడాలి. 
 

Also Read:  India Corona cases: దేశంలో కొవిడ్ కల్లోలం- ఈ నగరాల్లో అధిక తీవ్రత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News