చంద్రోదయం : చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్ !

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్

Last Updated : Sep 1, 2018, 08:17 PM IST
చంద్రోదయం : చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ స్టోరీ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. చంద్రోదయం అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ రానున్న దసరా సీజన్‌లో విడుదల కానున్నట్టు సమాచారం. ఈ మేరకు మేకర్స్ తాజాగా చంద్రోదయం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం పి వెంకట రమణ అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను రాజేంద్ర అనే నిర్మాత నిర్మిస్తున్నాడు. చంద్రబాబు పాత్రలో వినోద్ నటిస్తుండగా ఎన్టీఆర్ పాత్ర భాస్కర్ పోషిస్తున్నారు. ఇప్పటికే 80శాతం షూటింగ్ సైతం పూర్తయినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన వార్తలు మెయిన్ మీడియాలో సందడి చేయకపోవడం గమనార్హం. 

Trending News