Chiranjeevi Felicitates RRR Team : రామ్ చరణ్‌ బర్త్ డే సెలెబ్రేషన్స్.. RRR టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్

Chiranjeevi Felicitates RRR Team రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంను చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించాడు. రామ్ చరణ్‌ బర్త్ డే స్పెషల్‌గా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. దీనికి టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 04:11 PM IST
  • గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డే స్పెషల్
  • కొడుకు బర్త్ డేను సెలెబ్రేట్ చేసిన చిరు
  • ఆర్ఆర్ఆర్ టీంను సత్కరించిన మెగాస్టార్
Chiranjeevi Felicitates RRR Team : రామ్ చరణ్‌ బర్త్ డే సెలెబ్రేషన్స్.. RRR టీమ్‌ను సత్కరించిన మెగాస్టార్

Chiranjeevi Felicitates RRR Team గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27)ను మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేశాడు. సోమవారం హైదరాబాద్‌లో చిరు తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఉపాసన కలిసి ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేయగా.. చిరు ఇంట్లో ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. 

ఈ కార్య‌క్ర‌మానికి టాలీవుడ్ యంగ్ హీరోలు, దర్శక నిర్మాతలందరినీ కూడా చిరు ఆహ్వానించాడు. ఇక చ‌ర‌ణ్‌ను ఎంత‌గానో ఇష్ట‌ప‌డే హీరోలు  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విక్ట‌రీ వెంకటేష్ స‌హా రామ్ చ‌ర‌ణ్ చిన్న‌నాటి స్నేహితుడు రానా ద‌గ్గుబాటి త‌న స‌తీమ‌ణి మిహిక‌తో క‌లిసి పాల్గొన్నాడు. ఇంకా అక్కినేని నాగార్జున‌, అమ‌ల‌, నాగ చైత‌న్య‌, అఖిల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

కుర్ర హీరోలైన అడివి శేష్‌, నిఖిల్ సిద్ధార్థ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ, నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, దిల్ రాజు వంటి ప్రముఖులు సందడి చేశారు. రామ్ చ‌ర‌ణ్‌తో మంచి అనుబంధం ఉండే  దర్శకదిగ్గజం రాజ‌మౌళి, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ వంటి  పాన్ ఇండియన్ డైరెక్టర్లు కనువిందు చేశారు.

 

ఆస్కార్ గెలిచి వచ్చిన రాజ‌మౌళి స‌హా ఆర్ఆర్ఆర్ టీమ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌  కీర‌వాణి, నిర్మాత దాన‌య్య‌, సెంథిల్ కుమార్‌, కార్తికేయ‌, రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ త‌దిత‌రులందరినీ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించి సత్కరించాడు. ఆస్కార్ అవార్డును గెలిచి మ‌న దేశానికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన RRR టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా అభినందించాడు. అతిథుల‌కు ఇండియ‌న్, కాంటినెంటెల్ వంట‌కాల‌ను ప్రత్యేకంగా చేయించారు. ఇక ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ టీంను సత్కరించిన ఫోటోలను చిరు షేర్ చేస్తూ వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?

Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

More Stories

Trending News