Chiranjeevi: ఫ్లాప్ డైరెక్టర్ కి మరో ఛాన్స్.. చిరంజీవి షాకింగ్ నిర్ణయం!

Chiranjeevi Upcoming Movie: ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీ మెగాస్టార్ గా కొనసాగుతున్న హీరో చిరంజీవి. కానీ ఈ మధ్య మాత్రం చిరంజీవికి అనుకున్న స్థాయిలో విజయాలు రావడం లేదు. ఈ క్రమంలో చిరంజీవి తీసుకున్న మరో నిర్ణయం అభిమానులను షాక్ కి గురిచేస్తోంది..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 21, 2024, 03:24 PM IST
Chiranjeevi: ఫ్లాప్ డైరెక్టర్ కి మరో ఛాన్స్.. చిరంజీవి షాకింగ్ నిర్ణయం!

Viswambhara Update: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక బస్టర్  సినిమాలు అందించిన హీరో చిరంజీవి. కొద్ది సంవత్సరాల పాటు ఈ హీరో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకి గ్యాప్ ఇచ్చారు. అయితే రాజకీయాల్లో విఫలం అవ్వడంతో ఈ హీరో మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. కానీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మెగాస్టార్ కి అనుకున్న రేంజ్ లో విజయాలు అయితే అందలేదు. ఈ మధ్య వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మినహా కలెక్షన్స్ పరంగా చిరంజీవి సినిమా ఒక్కటి కూడా హిట్ అందుకోలేదు.

వాల్తేరు వీరయ్య సినిమా కథ పైన కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. సినిమా పాత చింతకాయ పచ్చడి లాగా ఉంది అంటూ మామూలు సినీ ప్రేక్షకులు విమర్శలు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం చిరంజీవి అలానే ఆయన అభిమానులు ఆశలన్నీ రాబోయే విశ్వంభర సినిమా పైనే ఉన్నాయి. ఎందుకు ముఖ్య కారణం ఈ సినిమా రీమేక్ కాకపోవడం అలానే ఈ చిత్రాన్ని బింబిసారా లాంటి సూపర్ హిట్ తీసిన వశిష్ట దర్శకత్వం వహించడం. ఈ సోషియో ఫాంటసీ చిత్రం తప్పకుండా మెగాస్టార్ కి ఒక మంచి విజయం అందిస్తుందని అందరూ భావిస్తున్నారు.

ఈ క్రమంలో చిరంజీవి తీసుకున్న మరో నిర్ణయం మళ్ళీ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. చిరంజీవి విశ్వంభర చిత్రంతో పాటు తన కుమార్తె సుశ్మిత నిర్మాణ సంస్థతో ఓ సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి మరో వార్త వైరల్‌గా మారింది. అదేమిటంటే ఈ చిత్రాని తమిళ దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తారని సమాచారం. ముందుగా ఈ సినిమాను సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి దర్శకత్వం వహించిన కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ మలయాళీ దర్శకుడు మోహన్‌రాజాకు ఈ ప్రాజెక్ట్‌‌ను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ నెరేషన్‌ కూడా అయిపోయిందని, చిరంజీవికి ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. 

అయితే మోహన్ రాజా గతంలో చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం ఫ్లాప్ గా మిగిలింది. సినిమా బాగానే ఉన్నా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో చిరంజీవి మళ్ళీ ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వటంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా కూడా రీమేక్ ఏమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News