Acharya temple set: ఆచార్య మూవీ టెంపుల్ సెట్ లీక్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ ఆచార్య కోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఒక ఆలయం సెట్టింగ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అచ్చమైన పురాతన ఆలయాన్ని తలపిస్తోన్న ఈ దేవాలయం సెట్టింగ్‌లో ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.

Last Updated : Jan 7, 2021, 01:50 AM IST
Acharya temple set: ఆచార్య మూవీ టెంపుల్ సెట్ లీక్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ ఆచార్య కోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఒక ఆలయం సెట్టింగ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అచ్చమైన పురాతన ఆలయాన్ని తలపిస్తోన్న ఈ దేవాలయం సెట్టింగ్‌లో ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. 

ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయ సెట్ పరిసరాలు, ప్రత్యేకతలను ఆవిష్కరిస్తూ బుధవారం మధ్యాహ్నం చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. అందమైన ఈ దేవాలయం సెట్టింగును మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను అంటూ చిరంజీవి ( Chiranjeevi ) పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also read : Sonu Sood gifts smartphones: ఆచార్య సెట్లో 100 స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేసిన సోనూసూద్‌

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకు సంబంధించిన ఈ దేవాలయం సెట్‌ను ప్రముఖ తమిళ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ రూపొందించారు. గత కొద్ది రోజులుగా ఈ దేవాలయం సెట్టింగులోనే ఆచార్య మూవీ షూటింగ్ ( Acharya movie shooting ) జరుగుతోంది. ఆచార్య సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తుండగా.. సొంత బ్యానర్‌పై రాంచరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Also read : Mahesh Babu's fan: మహేష్ బాబు ఫ్యాన్‌గా నాగ చైతన్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News