Vishwambhara: పెద్ద రిస్క్ తీసుకోబోతున్న చిరంజీవి.. విశ్వంభర నుంచి సూపర్ అప్డేట్!

Chiranjeevi: ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి చిరంజీవికి పెద్దగా చెప్పుకోదగిన విజయం రాలేదు. చిరు కమ్ బ్యాక్ ఇచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాలలో చిరంజీవికి ఏదైనా ఒక సూపర్ హిట్ ఉంది అంతే అది వాల్తేరు వీరయ్య మాత్రమే. ఈ క్రమంలో చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ విశ్వంభర గురించి ఒక కీలక అప్డేట్ తెగ వైరల్ అవుతుంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 15, 2024, 03:26 PM IST
Vishwambhara: పెద్ద రిస్క్ తీసుకోబోతున్న చిరంజీవి.. విశ్వంభర నుంచి సూపర్ అప్డేట్!

Vishwambhara Update: కొద్ది సంవత్సరాలుగా వరుస ప్లాపులతో సతమతమవుతూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఫైనల్ గా వాల్తేరు వీరయ్య సినిమా ఆయనకు మంచి విజయం సాధించి పెట్టింది. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత సంవత్సరం సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాని మహా ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి కెరియర్ లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా ఏది లేదు. వాల్తేరు వీరయ్య కూడా మంచి విజయం సాధించిన కథపరంగా ఆ చిత్రానికి గొప్ప అవార్డులు, రివార్డులు అయితే రాలేదు.

ఈ క్రమంలో ఈసారి ఎలా అయినా మెగా రేంజ్ లో సూపర్ హిట్ కొట్టాలి అని చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టు పై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బింబిసారా అలాంటి సూపర్ హిట్ తీసిన వశిష్టా దర్శకత్వంలో తన రాబోయే సినిమా విశ్వాంభర ఈ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి పెద్ద రిస్క్ తీసుకోబోతున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో భారీ సెట్ లో ఆంజనేయస్వామి విగ్రహం ముందర జరుగుతోంది. కాగా ఇక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం చిరంజీవి డూప్ వద్దన్నారట. కానీ స్వయంగా ఈ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొననున్నారట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పకువచ్చారు.

ఈ మధ్యనే విశ్వంభర సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఒక డూప్ ని సినిమా యూనిట్ తీసుకొచ్చారు. నేను ఎందుకు అని అడిగితే కొన్ని రిస్కీ సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పారు. అందుకు నేను డూప్ వద్దు నేనే చేస్తాను అని చెప్పాను. వాళ్లు రిస్క్ ఎందుకు అన్న.. నాలో ఇంకా ఆ శక్తి ఉండి నేనే చేస్తాను అని చెప్పుకొచ్చాను’ అని తెలియజేశారు. కాగా ఈ మధ్యనే సినిమా యూనిట్ ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసమే చిరంజీవి పెద్ద రిస్క్ తీసుకుంటున్నారని.. ప్రస్తుతం డూప్ లేకుండా ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అని సమాచారం.

Also Read: Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్‌? లేదా స్టంట్‌.. ఘటనపై అనుమానాలు ఇవే..

Also Read: KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్‌.. హెలికాప్టర్‌ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News