Chiranjeevi: చెల్లెళ్లను ఆట పట్టించిన చిరంజీవి

అన్నచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ ( Rakhi festival ). అందుకే మన దేశంలో ఈ పండగను కుల మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. అలాగే సెలబ్రెటీలు ( Celebrities rakshabandhan ) కూడా తమ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Last Updated : Aug 3, 2020, 10:56 PM IST
Chiranjeevi: చెల్లెళ్లను ఆట పట్టించిన చిరంజీవి

అన్నచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ ( Rakhi festival ). అందుకే మన దేశంలో ఈ పండగను కుల మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. అలాగే సెలబ్రెటీలు ( Celebrities rakshabandhan ) కూడా తమ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. Also read: Rakhi festival: రాఖి పౌర్ణమి నాడే మహిళలకు మరో కానుక

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇద్దరు చెల్లెల్లు వచ్చి మెగా బ్రదర్‌కు రాఖీ కట్టారు. అన్నయ్య ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వీట్లు తినిపించి రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరు.. తన ఇద్దరు చెల్లెల్లకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు. ఇద్దరికి రెండు హారాలు బహుమానంగా అందించారు. ఇద్దరికీ ఒకేలాంటి గిఫ్ట్ ఇస్తున్నాను.. మళ్లీ కొట్టుకోకుండా అంటూ 'చిరు'నవ్వు చిందించాడు. ఇలా ప్రతీ సంవత్సరం వాళ్ల చెల్లెళ్లు చిరుకి రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకోవడం.. అన్నయ్య ఎప్పుడూ ఆ చెల్లెళ్లకు ప్రేమతో ఏవో కానుకలు ఇస్తుండటం ఎప్పుడూ చూస్తున్నదే. Also read: Pangolin scales: తెలంగాణ టు చైనా పంగోలిన్ పొలుసుల స్మగ్లింగ్

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy Raksha Bandhan!

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

తన చెల్లెల్లతోనే కాదు తెలుగింటి ఆడుపడుచులు అందరితోనూ అన్నయ్య అనే పిలిపించుకునే అదృష్టం తనకు దక్కిందని చెప్పిన చిరంజీవి.. రాఖీ పండగ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

చిరు లాక్‌డౌన్ సమయాన్ని తన కుటుంబంతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిరు ప్రస్తుతం ఆచార్య సినిమాతో ( Acharya movie) బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. Also read: Kavitha ties Rakhi to KTR: మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

Trending News