Curry and Cyanide: సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కర్రీ & సైనేడ్.. 30 దేశాల్లో హవా కొనసాగిస్తున్న సిరీస్..

Jolly Joseph Case : కరోనా లాక్ డౌన్ అయిన దగ్గర నుంచి సినీ అభిమానులు థియేటర్స్ లో సినిమాలకే కాదు ఓటిటి సిరీస్ లకి కూడా బాగా అలవాటు పడిపోయారు. అందుకే ప్రతి ఒక్క డిజిటల్ ప్లాట్ ఫామ్ తమ తమ ఒరిజినల్ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య రిలీజ్ అయిన ఒక వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 01:44 PM IST
Curry and Cyanide: సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కర్రీ & సైనేడ్.. 30 దేశాల్లో హవా కొనసాగిస్తున్న సిరీస్..

Netflix Best Series: థియేటర్స్ లో సినిమాలు చూడడానికి సినీ అభిమానులు ఎంత ఆసక్తి చూపిస్తారో…ప్రస్తుతం ప్రతివారం ఓటీటీల్లో వస్తున్న వెబ్ సిరీస్ చూడడానికి కూడా అంతే ఆసక్తి చూపిస్తున్నారు. 
ప్రతివారం ఓటీటీల్లో ఏదో ఒక మంచి మంచి సిరీస్ లు, సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇక నెట్ ఫ్లిక్స్ లో అయితే రెగ్యులర్ గా సిరీస్ లు వస్తుంటాయి. అందుకే ప్రస్తుతం ఉన్న ఓటిటి ప్లాట్ఫార్మ్స్ లో నెట్ ఫ్లిక్స్ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య రిలీజ్ అయిన ఒక డాక్యుమెంటరీ సిరీస్ ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ క్రేజ్ మరింత పెంచేసింది.

ఇటీవల ‘కర్రీ & సైనేడ్’ అనే ఓ డాక్యుమెంటరీ సిరీస్ ని తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్‌ ఈ వెబ్ సిరీస్ ను కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ సిరీస్ గురించే సోషల్ మీడియా మొత్తం చర్చ జరుగుతోంది. అసలు ఈ సిరీస్ లో అంటగా ఏముంది అనే విషయం ఒకసారి చూద్దాం.

ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. పెళ్ళైన జాలి అనే మహిళ.. చాలా విలాసవంతమైన జీవితం గడపాలి అనుకుంటుంది. కానీ దానికి అడ్డుపడుతున్న వారిని ఒక్కొక్కరిగా తినే ఆహారంలో సైనైడ్ కలిపి చంపేస్తుంది. ఆస్తికోసం మామని, అనుమానిస్తున్నాడని భర్తని, ఆ తర్వాత బాబాయ్ ని, ఆఖరికి తన స్నేహితురాలిని.. ఇలా ఆరుగురిని ఆహారంలో సైనైడ్ కలిపి చంపేస్తుంది. ఇవన్నీ సాధారణ మరణాలుగా చిత్రీకరించి ఎవరికీ అనుమానం రాకుండా చేస్తుంది. అయితే కొద్ది సంవత్సరాల తరువాత జాలి ఆడపడుచుకి అనుమానం వచ్చి దీని పైన ఎంక్వయిరీ చేసి పోలీసులకు సమాచారమిస్తుంది. దీంతో పోలీసులు ఆ జాలి అనే మహిళ కథని ఎలా క్లోజ్ చేశారు, ఆ కేసుని ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ.

ప్రస్తుతం ఈ సిరీస్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. నెట్‌ఫ్లిక్స్ లో లో థ్రిల్లింగ్ సిరీస్ గా తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రపంచం మొత్తం టాప్ లో ట్రెండింగ్ అవుతుంది. డిసెంబర్ 22న నెట్‌ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజయింది. విడుదల అయిన దగ్గర్నుంచి దాదాపు రెండు వారాలుగా 30 దేశాల్లో ఈ ‘కర్రీ & సైనేడ్’ సిరీస్ టాప్ 10 లోనే కొనసాగుతుంది.

మొదటి నుంచి చివర వరకు చాలా థ్రిల్లింగ్ తో ఉండడంతో సినీ అభిమానులు అందరూ ఈ సిరీస్ ను భాషతో సంబంధం లేకుండా విపరీతంగా చూస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ చిత్రం 2 వారాలుగా 30 దేశాల్లో టాప్ టెన్ ప్లేస్ లో ఉంది అనే పోస్టర్ని షేర్ చేశారు. 

 

 ఇక ఈ ‘కర్రీ & సైనేడ్’ సిరీస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఇప్పటివరకు ఈ సిరీస్ చూడకపోతే ఒకసారి చూసేయండి. 

Also Read: Oppo Reno 11 Series: శక్తివంతమైన 50MP కెమెరాతో మార్కెట్‌లోకి Oppo Reno 11, Reno 11 Pro మొబైల్స్‌..విడుదల తేది అప్పుడే..

Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News