Producer Gift to Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలకు గిఫ్టుగా 80 లక్షల కారు.. 'బాంచత్' దెబ్బ మామూలుగా లేదుగా!

Luxury Car Gift to Dasara Director: నాని హీరోగా నటించిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతున్న క్రమంలో ఆయనకు నిర్మాత ఒక లగ్జరీ కారు గిఫ్టుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు..  

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 6, 2023, 12:14 PM IST
Producer Gift to Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలకు గిఫ్టుగా 80 లక్షల కారు.. 'బాంచత్' దెబ్బ మామూలుగా లేదుగా!

Producer Sudhakar Cherukuri Luxury Car gift to Dasara Director Srikanth Odela: నాని హీరోగా నటించిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాని నాని కెరీర్ లోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకి మిగతా భాషల్లో పెద్దగా కలెక్షన్స్ రాకపోయినా తెలుగులో మాత్రం కలెక్షన్స్ విషయంలో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే నాలుగు రోజుల పాటు కలెక్షన్స్ పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 33 కోట్ల 53 లక్షల షేర్, 56 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

అన్ని ప్రాంతాల్లో కలిపితే 47 కోట్ల 13 లక్షల షేర్ 84 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ దసరా సినిమా ఓవరాల్ బిజినెస్ 48 కోట్లకు జరగడంతో 49 కోట్లు వసూలు చేస్తే థియేట్రికల్ హిట్ అవుతుంది. ఇంకా అలా కోటి 87 లక్షలు వసూలు చేస్తే ఈ సినిమా హిట్టుగా నిలవబోతోంది. అయితే ఈ దసరా సినిమా మిగతా ప్రాంతాల్లో మాత్రం పెద్దగా జోరు చూపించలేకపోయినా తెలుగులో మాత్రం పెట్టిన డబ్బులు పెట్టినట్లే వెనక్కి వచ్చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు 80 లక్షలు విలువ చేసే ఒక లగ్జరీ కార్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి శ్రీకాంత్ ఓదెలకు ఇది మొదటి సినిమా కావడంతో ఆయనను నమ్మి ఇన్ని కోట్లు పెట్టడం అనేది చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెలకు డైరెక్టర్గా రెమ్యూనరేషన్ కాస్త తక్కువగానే మాట్లాడుకున్నారట. సినిమా హిట్ అయిన తర్వాత ఏదో ఒకటి చేస్తానని నిర్మాత మాటిచ్చి నట్లు తెలుస్తోంది. సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురుస్తూ ఉండడంతో నిర్మాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటించగా దీక్షిత్ శెట్టి, షైన్ చాం టాకో, సాయికుమార్, సముద్రఖని వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు.

Also Read: Good Friday 2023: గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? బ్లాక్ డే కూడా అంటారా?

Also Read: Dasara Movie: ఏం సినిమారా బాబూ.. దసరా గురించి ప్రభాస్ పోస్ట్ వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News