Deadpool & Wolverine: హాలీవుడ్ మూవీ ‘డెడ్ పుల్ అండ్ వాల్వరిన్’ తెలుగు వెర్షన్ లో మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి సాంగ్.. ఇదేం మాస్ రచ్చరా మామ..

Deadpool & Wolverine: వాల్డ్ వైడ్ గా  మార్వెల్ సిరీస్ మూవీస్ సిరీస్ కు  మంచి క్రేజ్ ఉంది. మన భారతీయ ప్రేక్షకులు సైతం ఈ సినిమాలను ఆదరించిన సందర్భాలున్నాయి. ఇపుడీ సిరీస్ లో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మూవీకి త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది. అందులో మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి సాంగ్ వైరల్ తెగ వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 23, 2024, 04:45 PM IST
Deadpool & Wolverine: హాలీవుడ్ మూవీ ‘డెడ్ పుల్ అండ్ వాల్వరిన్’  తెలుగు వెర్షన్ లో మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి సాంగ్.. ఇదేం మాస్ రచ్చరా మామ..

Deadpool & Wolverine: మార్వెల్ మూవీ యూనీవ‌ర్స్ లో మ‌రో కొత్త సినిమా రాబోతుంది. ఈ సారి ఫ్యాన్స్ ను ఉర్రూత‌లుగించేందుకు డబుల్ ఫన్ తో రెడీ అవుతోంది. డెడ్ పుల్ మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో చిత్రం ‘డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్’ సినిమా  జూలై 26న విడుద‌ల‌ కాబోతుంది. ఈ సినిమాలో సూప‌ర్ హీరో డెడ్ పుల్ తో పాటు మిలీనియ‌మ్ సూప‌ర్ హీరో ఎక్స్ మెన్ లో మోస్ట్ ఫెవ‌రేట్ వాల్వ‌రిన్ కూడా సిల్వ‌ర్ స్రీన్ పై ఫైట్లు చేయ‌బోతున్నాడు.
దీంతో ఒకేసారి ఇద్ద‌రు హీరోలు చేయ‌బోయే అద్భుత‌మైన విన్యాసాల‌ను మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్స్ కు వ‌రల్డ్ వైడ్ విప‌రీతంగా క్రేజ్ తో పాటు బజ ఏర్ప‌డింది, ఈ నేప‌థ్యంలో మార్వెల్ టీమ్ ఈ సినిమాను అన్ని భాష‌ల్లో ఉన్న సినీ అభిమానుల‌ను మ‌రింత అల‌రించే విధంగా తీర్చిదిద్దేందుకు డ‌బ్బింగ్ వెర్ష‌న్స్ ను రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను భారతీయ భాల్లో డబ్ చేసి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.  తెలుగులో కూడా ఈ మూవీ ఫ్యాన్స్ ను అత్యంత ఆకట్టుకుంద‌నే విష‌యం తెలుగు ట్రైల‌ర్ చూస్తే అర్ధం అవుతుంది.

ప్రస్తుతం తెలుగులో ఉన్న ట్రెండింగ్ ప‌దాల‌తో పాటు.. ప్రస్తుతం మన యువత మాట్లాడకుంటున్న సాధారణ పదాలతో ఉన్న డైలాగులు హైలెట్ కానున్నాయి.  తెలుగు సినీ అభిమానులు ఇటీవ‌ల ఇష్ట‌ప‌డిన కుర్చీమ‌డ‌త‌పెట్టి, కెవ్వుకేక‌, రింగ రింగ ఇలా అనేక అన్ లైన్ ట్రెండింగ్ కీ వ‌ర్డ్స్ తో డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్ తెలుగు వెర్ష‌న్ సిద్ధం అయింది. ఈ చిత్రంలో వాల్వ‌రిన్ గా హుయ్ జాక్ మెన్, డెడ్ పుల్ గా ర‌య‌న్ రెనాల్డ్స్ క‌నిపించ‌బోతున్నారు. వాల్డ్ వైడ్ గా ఈ సినిమాను  జూలై 26న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News