Dhanush: జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్.. అసలు విషయం బయటపెట్టిన హీరో

Dhanush- Jr NTR: ధనుష్ హీరోగా నటిస్తున్న రాయన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ధనుష్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. తెలుగులో తన ఫేవరెట్ హీరో, మల్టీ స్టారర్ సినిమా చేయాలంటే ఎవరితో చేస్తారు అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు ధనుష్ కూడా జవాబు ఇచ్చారు. అవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 

Written by - Vishnupriya | Last Updated : Jul 22, 2024, 01:33 PM IST
Dhanush: జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్.. అసలు విషయం బయటపెట్టిన హీరో

Raayan Pre-release Event: టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా ఇప్పుడు రాయన్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులందరికీ రాబోతున్నారు. ఈ సినిమా మీద ప్రేక్షకులకి భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ లో మాత్రమే కాక తెలుగులో కూడా ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 26న.. థియేటర్లలో విడుదల కి సిద్ధం అవుతుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమా కథను ధనుష్ స్వయంగా రాసుకోవడమే కాక స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాలో హీరోగా నటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు డబల్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. 

అయితే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ.. ధనుష్ చెప్పిన కొన్ని జవాబులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో ఎవరైనా హీరోతో మల్టీస్టారర్ సినిమా.. చేయాలంటే ఎవరితో చేస్తారు.. అని ప్రశ్న ధనుష్ కి ఎదురైంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీరిలో ఎవరితో మల్టీ స్టార్టర్ చేస్తారు అని అడగగా.. ధనుష్ కాసేపు ఆలోచించి తారక్ అని జవాబు ఇచ్చారు.

తెలుగులో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అన్న ప్రశ్నకి ధనుష్ అక్కడి జనాల వైపు చూస్తూ.. "నేను ఆన్సర్ చెప్తాను కానీ మిగతా సినిమా హీరోల ఫ్యాన్స్ నన్ను ద్వేషించవద్దు. ఐ లవ్ సినిమా. ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్" అంటూ జవాబు ఇచ్చారు ధనుష్. 

ధనుష్ ఇలా తెలుగు హీరోల గురించి మాట్లాడుతూ సినిమాపై తెలుగు ప్రేక్షకులకు కూడా ఆసక్తి కలిగించారు అని చెప్పవచ్చు. అయితే మనకు ఆసక్తికరమైన ప్రశ్న కూడా ధనుష్ కి ఎదురయింది. ఈ సినిమాకి హీరో డైరెక్టర్ రెండు ధనుష్. అయితే ఒకవేళ ధనుష్ ఈ సినిమాకి కేవలం దర్శకత్వం మాత్రమే వహిస్తే.. సినిమాలో హీరోగా ఎవరి నటిస్తే బాగుండేది అని ప్రశ్న కి ధనుష్ ఇచ్చిన జవాబు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 

ధనుష్ ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే రజినీకాంత్ సార్ అని చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఈవెంట్ కి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. విడుదల కి ముందే క్రేజ్ కూడా బాగానే ఉంది కాబట్టి.. సినిమా తెలుగులో కూడా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News