Dil Raju Fires : మీడియా వాళ్ళు ఏదో ఒకటి కెలుకుతూవుంటారు.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

Dil Raju Shocking Comments on Media: విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఒక సినిమాను నిర్మించిన దిల్ రాజు తాజాగా ఒక ఈవెంట్లో మీడియా మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే 

Last Updated : Dec 16, 2022, 10:28 PM IST
Dil Raju Fires : మీడియా వాళ్ళు ఏదో ఒకటి కెలుకుతూవుంటారు.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

Dil Raju Shocking Comments on Media: ఎప్పుడైతే విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాని సంక్రాంతి బరిలో దింపాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమలో అనేకమందికి టార్గెట్ గా మారుతున్నారు. గతంలో దిల్ రాజు డబ్బింగ్ సినిమాలకు వ్యతిరేకంగా చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనకే వినిపిస్తూ ఆయనని ఒకరకంగా కార్నర్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. తాజాగా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు దిల్ రాజు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆయన మాట్లాడిన అనేక విషయాల మీద నెటిజన్లు మరోసారి విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

వారసుడు సినిమా రిలీజ్ విషయంలో దిల్ రాజు పెద్ద ఎత్తున టార్గెట్ అవుతున్న నేపద్యంలో తాజాగా ఆ నెగెటివిటీ తగ్గించుకునేందుకు ఆయన ఒక మీడియా సంస్థకు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు అయితే ఆ ఇంటర్వ్యూలో తమిళంలో అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో అని కామెంట్ చేయడంతో ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ అందరూ దిల్ రాజుని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మీడియా ప్రతినిధి ఒకరు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరే ట్రెండ్ అవుతున్నారు అజిత్ ఫ్యాన్స్ అందరికీ టార్గెట్ అవుతున్నారు దానిపై మీ స్పందన ఏమిటి అని అడిగిన నేపథ్యంలో ఇదే విషయం గురించి తాజాగా దిల్ రాజు పాల్గొన్న ఒక సినిమా అనౌన్స్మెంట్ ఈవెంట్ లో దిల్ రాజుని ప్రశ్నిస్తే ఆయన మీడియా ప్రతినిధులపై ఫైర్ అయ్యారు.

మీ మీడియా వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి కెలుకుతూనే ఉంటారని ఇప్పుడు ఆ విషయాన్ని మళ్లీ కెలక వద్దని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు బలగం అనే సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుందాం మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటూ దాటవేశారు. వాస్తవానికి దిల్ రాజు ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ పేరుతో ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ ని ఓపెన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ కి తన కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుందని ఆయన అనౌన్స్ చేశారు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి మొదటి సినిమాగా బలగం అనే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పకొచ్చారు. ఇంతకుముందు ఈ బ్యానర్ పై ఏటీఎం అనే వెబ్ సిరీస్ మొదలు పెట్టామని ఇప్పుడు బలగం అనే సినిమా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సినిమాతో జబర్దస్త్ వేణు దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడని ఆయన పేర్కొన్నారు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యానర్ స్టార్ట్ చేశామని దిల్ రాజు పేర్కొన్నారు. అందులో భాగంగానే మొదటి సినిమాగా ఈ బలగం అనే సినిమా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Also Read: Liger Financier: లైగర్ ను వదలని ఈడీ.. ఈసారి 'శోభన్' విచారణ!

Also Read: Besharam Song: దీపికాకు ప్రకాశ్‌రాజ్ మద్దతు, బీజేపీ నేతలపై బేషరం బిగోట్స్ అంటూ మండిపాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News