Gunasekhar - Euphoria: శాకుంతలం తర్వాత మరో డిఫరెంట్ మూవీ 'యుఫోరియా'ను అనౌన్స్ చేసిన గుణశేఖర్..

Gunasekhar - Euphoria: తెలుగులో దర్శకుడు గుణశేఖర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ తరంలో అన్ని జానర్స్‌లో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన 'యూఫోరియా' అనే టైటిల్‌తో ఓ కొత్త సినిమా అనౌన్స్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 28, 2024, 12:18 PM IST
Gunasekhar - Euphoria: శాకుంతలం తర్వాత మరో డిఫరెంట్ మూవీ 'యుఫోరియా'ను అనౌన్స్ చేసిన గుణశేఖర్..

Gunasekhar - Euphoria: తెలుగులో డిఫరెంట్ జానర్ సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు సెపరేట్ క్రేజ్ ఉంది. ఈయన అప్పట్లో ఎన్టీఆర్‌తో 'రామాయణం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ఈ సినిమాకు అప్పట్లో జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత చిరంజీవితో 'చూడాలని వుంది' మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.  ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు ఆయన్ని పలకరించినా.. మహేష్ బాబుతో  చేసిన 'ఒక్కడు' సినిమాతో  మళ్లీ దర్శకుడిగా తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ తర్వాత అర్జున్, సైనికుడు సినిమాలతో డీలా పడ్డాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, అనుష్క, రానాలతో తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా తర్వాత సమంత టైటిల్ రోల్లో 'శాకుంతలం' సినిమను తెరకెక్కించాడు. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌తో పాటు హీరో మైనస్‌గా మారడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఈ సినిమా కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. అంతేకాదు ఈ సినిమాలో శకుంతల పాత్రను అంగాంగ ప్రదర్శనకే పరిమితం చేయడం వంటి కారణాలు ఈ సినిమా అపజయానికి కారణాలు అని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత గుణశేఖర్.. తన స్వంత దర్శకత్వంలో 'యుఫోరియా' అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్  బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. సినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర టెక్నిషియన్స్‌కు  సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.మరి ఈ సినిమాతో గుణశేఖర్ దర్శకుడిగా బ్యాక్ బౌన్స్ అవుతారా లేదా అనేది చూడాలి.

Also read: AP Elections Survey: ఏపీలో అధికారం ఎవరిది, జగన్‌కు క్లారిటీ వచ్చేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News