Hello Meera : ఒకే పాత్రతో గంటన్నర .. 'హలో మీరా'తో ప్రయోగం

Hello Meera Movie సింగిల్ కారెక్టర్‌తో సినిమాను రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒకే ఒక్క పాత్రతో థియేటర్లో ప్రేక్షకులను కట్టి పడేయడం అన్నది సాధారణ అంశం కాదు. హలో మీరా సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 04:13 PM IST
Hello Meera : ఒకే పాత్రతో గంటన్నర .. 'హలో మీరా'తో ప్రయోగం

Hello Meera Movie ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రాలు, కొత్త కంటెంట్, కాన్సెప్ట్‌లకు ఆదరణ లభిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల జానర్లు, అన్ని రకాల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రఖ్యాత డైరెక్టర్ బాపు దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన కాకర్ల శ్రీనివాస్.. చివరి సినిమా వరకు నీడలా ఆయన వెంటే ఉన్నారు. 

అలా బాపు దగ్గర పని చేసిన అనుభవంతో ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రమైన హలో మీరాతో అందరినీ మెప్పించేందుకు రెడీ అయ్యారు. ఒకే ఒక్క క్యారెక్టర్‌‌లో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ వెండితెరపై పండించడం అంత సులభం ఏమీ కాదని అందరికీ తెలిసిందే. 

తెరపై ఒక అమ్మాయిని మాత్రమే చూపిస్తూ సగటు ప్రేక్షకుడి బుర్రలో బోలెడు రోల్స్ మెదిలేలా ఈ సినిమాను తెరకెక్కించడమే ఇందులోని ప్రత్యేకం. తెరపై కనిపించేది మీరాయే అయినా వినిపించే పాత్రలన్నీ సగటు ప్రేక్షకుడి మదిలో మెదిలేలా డిజైన్ చేశారు. ప్రేమ, స్నేహం, స్నేహితుల కోసం దెబ్బలు తినడం, మీడియా సమావేశంలో గొడవలూ, రౌడియిజాలూ, కొట్లాటలూ, tvలో బ్రేకింగ్ న్యూస్ అన్నీ అర్థమయ్యేలా, కనిపించేలా సీన్లను రూపొందించారని తెలుస్తోంది.

Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్

హలో మీరా సినిమాకు సంబంధించి ఇది వరకు విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఏప్రిల్ 21న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫైనల్ కాపీ చూసిన కొందరు ప్రముఖులు మేకింగ్‌ను చూసి ఫిదా అయ్యారట. ఎంగేజింగ్‌గా తీయడంపై కాకర్ల శ్రీనివాస్ ప్రతిభను మెచ్చుకున్నారని తెలుస్తోంది. ఇక గార్గేయి గురించి స్పెషల్‌గా అందరూ మాట్లాడుకుంటారని తెలుస్తోంది. ఎవ్వరికీ చెప్పొద్దు అనే సినిమా తరువాత గార్గేయి మళ్లీ హలో మీరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News