Double Ismart Digital Rights: దిమ్మతిరిగే రేట్ కు అమ్ముడుపోయిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ రైట్స్..

Double Ismart Digital Rights: రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్మడుపోయాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ అదే రేంజ్ లో అమ్ముడు పోయాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 28, 2024, 10:27 AM IST
Double Ismart Digital Rights: దిమ్మతిరిగే రేట్ కు అమ్ముడుపోయిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ రైట్స్..

Double Ismart Digital Rights: ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత హీరోగా రామ్ పోతినేని, దర్శకుడిగా పూరీ జగన్నాథ్ మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘స్కంధ’ మూవీతో పలకరించాడు. ఓవర్ యాక్షన్ డోస్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరుగానే నడిచింది. ఈ సినిమాలో రామ్ .. ఊర మాస్ రాంపేజ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తోన్న  ‘ డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేస్తున్నాడు. ‘ ఇస్మార్ట్ శంకర్’ విజయంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ ను మించిన డబుల్ డోస్ తో ఈ సినిమా ఉండబోతున్నట్టు పూరీ జగన్నాథ్ చెబుతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. దీంతో ఈ సినిమాపై నార్త్ లో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్  కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

దాదాపు రూ. 35 కోట్ల కు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందట. హిందీ తప్ప మిగిలిన నాలుగు భాషలకు సంబంధించి డిజిటల్ డీల్ క్లోజ్ అయింది. అంతేకాదు సినిమా విడుదలైన 7 వారాలకు స్ట్రీమింగ్ కు వచ్చేలా ముందుగానే ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీని వచ్చే నెల ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నారు. మరి ఇస్మార్ట్ శంకర్ మాదిరే డబుల్ ఇస్మార్ట్ తో రామ్ పోతినేనికి పూరీ జగన్నాథ్  హిట్  అందిస్తాడా లేదా అనేది వెయిట్ అండ్ సీ.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News