Double Ismart Movie Pre Release Business: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా సంజయ్ దత్ లీడ్ రోల్లో నటించిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా 2019లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో దాదాపు రూ. 40 కోట్ల షేర్ రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా 5 యేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
నైజాం (తెలంగాణ).. రూ. 15.50 కోట్లు
సీడెడ్ (రాయలసీమ).. రూ. 6 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 17.50 కోట్లు
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 39 కోట్లు..
హిందీ + కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి.. రూ. 6 కోట్లు..
ఓవర్సీస్.. రూ. 3 కోట్లు
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ. 49 కోట్ల షేర్ రాబట్టాలి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు కాస్ట్లీ కాపీలా కనిపిస్తోంది.
ఈ సినిమా పూర్తి పాజిటివ్ టాక్ వస్తే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమే. పైగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే.. లాంగ్ వీకెండ్ కలిసొచ్చే అవకాశాలున్నాయి.మరోవైపు ఈ సినిమాలో రామ్ పోతినేని, కావ్య థాపర్ తో చేసిన సాంగ్స్, ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా కాలం తర్వాత అలీ ఈ సినిమాలో పూర్తి స్థాయి కమెడియన్ పాత్రను పోషించారు. రీసెంట్ గా ‘బడ్డి’మూవీలో ఉన్న పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది.
మొత్తంగా మాస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించినట్టు ఈ సినిమా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అంతేకాదు సంజయ్ దత్, రామ్ పోతినేని మధ్య వచ్చే సీన్స్ పేలితే ఈ సినిమా హిట్ అవ్వడం పక్కా అని చెప్పాలి. అంతేకాదు రామ్ పోతినేనికి తొలి ప్యాన్ ఇండియా చిత్రం అని చెప్పాలి. ఇప్పటికే యూట్యూబ్ లో తన హిందీ డబ్బింగ్ చిత్రాలతో అక్కడ ప్రేక్షకులకు చేరువయ్యాడు. యూట్యూబ్ ఇమేజ్ వేరు.. డైరెక్ట్ సినిమాలు రిలీజ్ చేయడం వేరు అని సంగతి గుర్తు పెట్టుకోవాలి. గతంలో యూట్యూబ్ క్లిక్స్ చూసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన హిందీ ‘ఛత్రపతి’ రీమేక్ ను అక్కడి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తున్నాయని అక్కడ ఇమేజ్ ఉందనుకుంటే పొరపాటే అవుతుంది.
మొత్తంగా రామ్ పోతినేని బడా టార్గెట్ ను ముందు పెట్టుకొని ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మరోవైపు ఈ సినిమా సక్సెస్ అనేది దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కు అటు హీరోగా రామ్ పోతినేని కీలకం అనే చెప్పాలి. పూరీ జగన్నాథ్ పూర్తి స్థాయిలో తన మార్క్ తో తెరకెక్కించాడు. గతంలో లైగర్ వల్ల కలిగిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు. మరి ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో పూరీ జగన్నాథ్ .. తనతో పాటు హీరో రామ్ పోతినేనికి మంచి హిట్ అందిస్తాడా లేదా అనేది చూడాలి.
Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter