ఎగిరెగిరే.. వీడియో సాంగ్: గీత గోవిందం మ్యూజిక్ మేజిక్ రిపీటవుద్దా ?

ఎగిరెగిరే.. లిరికల్ వీడియో సాంగ్

Last Updated : Aug 27, 2018, 07:03 PM IST
ఎగిరెగిరే.. వీడియో సాంగ్: గీత గోవిందం మ్యూజిక్ మేజిక్ రిపీటవుద్దా ?

గీత గోవిందం సినిమాకు మ్యూజిక్ ఎంత హైలైట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గోపీ సుందర్ అందించిన మ్యూజిక్‌కి ప్రముఖ యువ నేపథ్యగాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన రెండు పాటలు ( ఇంకేం ఇంకేం ఇంకేం కావేలే, వచ్చిందమ్మా వచ్చిందమ్మా) సూపర్ హిట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఆ రెండు పాటలు ఆ సినిమాను మరో ఎత్తుకు చేర్చాయి. అదేవిధంగా గతంలో ఇదే గోపీసుందర్ కంపోజిషన్‌లోనే నిన్ను కోరి సినిమాకు సిద్ శ్రీరామా పాడిన అడిగా అడిగా పాట ఎంత ఆకట్టుకుందో యూట్యూబ్‌లో ఆ పాటకు వచ్చిన వ్యూస్ చెబుతాయి. తాజాగా ఇదే మ్యూజిక్ కాంబో మరోసారి శైలజా రెడ్డి అల్లుడు సినిమా కోసం రిపీటవుతోంది. శైలజా రెడ్డి అల్లుడు సినిమా కోసం గోపీ సుందర్ కంపోజిషన్‌లో సిద్ శ్రీరాం పాడిన ఎగిరెగిరే అనే లిరికల్ వీడియో సాంగ్ ఇవాళే ఆడియెన్స్ ముందుకొచ్చింది. సిద్ శ్రీరాంకు తోడు లిప్సిక ఫీమేల్ వాయిస్ అందించింది. ఈ పాట కూడా వీళ్లిద్దరి గత పాటల్లోనే మేజిక్ రిపీట్ చేస్తుందో లేదో తెలియాలంటే ఈ లిరికల్ వీడియో సాంగ్ పై ఓ లుక్కేయాల్సిందే మరి.

 

Trending News