F3 Movie Review: 'ఎఫ్ 3' మూవీ రివ్యూ.. అధ్యక్ష్యా!! అనిల్ రావిపూడి మూవీ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా!

F3 Movie Review: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి మరోసారి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు (మే 27) థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రం ఎలా ఉంది? కథ, కథనం, నటన ప్రేక్షకులను మెప్పించాయా? అనే విశేషాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 10:15 AM IST
F3 Movie Review: 'ఎఫ్ 3' మూవీ రివ్యూ.. అధ్యక్ష్యా!! అనిల్ రావిపూడి మూవీ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా!

F3 Movie Review: సరిగ్గా మూడేళ్ల క్రితం 2019 సంక్రాంతి కానుకగా 'ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్)' మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ విజయం సాధించడం వల్ల ఇప్పుడా మూవీకి సీక్వెల్ రూపొందించారు. 'ఎఫ్ 3' పేరిట తెరకెక్కిన ఈ చిత్రం నేడు (మే 27) థియేటర్లలో విడుదలైంది. తొలుత ఈ మూవీని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించినా.. కరోనా సంక్షోభం, పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ నేపథ్యంలో 'ఎఫ్ 3' మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు. అయితే నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? కథ, కథనం ప్రేక్షకులను మెప్పించాయా? తమ నటనతో నటీనటులు ఆకట్టుకున్నారా? అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. 

కథ ఏంటంటే?

'ఎఫ్ 2' సినిమాలో పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య సన్నివేశాలను ఫన్నీగా తెరపై చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు సీక్వెల్ 'ఎఫ్ 3' మూవీలో డబ్బు కథాంశంగా తీసుకొని ఫన్నీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. డబ్బు ప్రతి ఒక్కరి జీవితానికి ముడిపడి ఉండడం వల్ల దాన్ని బేస్ చేసుకొని.. ఫన్నీ చూపించేందుకు 'ఎఫ్ 3' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 

ప్రతి మనిషికి ఆశ ఉంటుంది.. కానీ, దురాశ దుఃఖానికి చేటు అనే పాయింట్ ను స్టోరీలైన్ గా తీసుకున్నారు. డబ్బు సంపాందించేందుకు అనేక దారులు ఉన్న ఈరోజుల్లో.. డబ్బు ఆర్జన కోసం ప్రజలు చేసే పనులేంటో ఫన్నీగా చూపించారు. సినిమా మొత్తం ఆద్యంతం నవ్వులతో ఆస్వాదించడమే కాకుండా.. చివర్లో చక్కటి సందేశంతో సినిమాను ముగించారు దర్శకుడు అనిల్ రావిపూడి. 

నటీనటులు ఎలా చేశారంటే?

'ఎఫ్ 2' సినిమాతో 'ఎఫ్ 3'ని కంపేర్ చేస్తే.. అందులో వెంకటేష్ కు కుటుంబం ఉండదు. కానీ, ఇందులో వెంకటేష్ కు ఫ్యామిలీ ఉంటుంది. వరుణ్ తేజ్ తల్లి పాత్ర ఈ సినిమాలో కనిపించలేదు. అంతే కాకుండా.. గత చిత్రంలోని లేని కొత్త పాత్రల్లో సునీల్, సోనాల్ చౌహాన్, అలీ, మురళీ శర్మ, పూజా హెగ్డే తదితరులు నటించారు. 

సినిమాలోని నటీనటులంతా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది. రేచీకటితో బాధపడుతున్న వ్యక్తిగా వెంకటేష్.. నత్తితో వరుణ్ తేజ్ ఫన్ ను జనరేట్ చేశారు. ఈ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ హైలైట్ గా ఉంటుంది. 

ఫైనల్ ముచ్చట!

దర్శకుడు అనిల్ రావిపూడి తాను రాసుకున్న కథకు న్యాయం చేసినట్లు ఉంది. కథతో సన్నివేశాల్లో దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాను మరోమెట్టు పైకి ఎక్కించింది. కెమెరా పనితనం బాగుంది. నిర్మాత దిల్ రాజు పెట్టుబడికి.. అనిల్ రావిపూడి విజన్ కు థియేటర్లలో నవ్వుల పువ్వులు కురుస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీతో ఆనందంగా ఆస్వాదించదగ్గ చిత్రం 'ఎఫ్ 3'. 

Also Read: F3 Movie on OTT: ఎఫ్ 3 సినిమా ఓటీటీ హక్కులు ఎవరికి సొంతం ? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Also Read: F3 Movie review and rating: ఎఫ్ 3 బొమ్మ అదిరిందట, ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది. రేటింగ్ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News