ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఎంజీఆర్ వర్శిటీ గౌవర డాక్టరేట్ ప్రధానం చేసింది. వర్శిటీ స్నాతకోత్సవం సందర్భంలో మోహన్ బాబు ఈ గౌరవాన్ని స్వీకరించారు. ఇది మోహన్ బాబు సినీ ప్రస్థానంలో మైలు రాయిగా నిలిచిపోతుంది. కాగా మోహన్ బాబు 500పై చిత్రాల్లో నటించారు. చిత్రపరిశ్రమకు ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇదివరకే అమెరికా లోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, విద్య రంగాల్లో కృషికి గాను మోహన్ బాబుకు గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు
మోహన్ బాబుకు డాక్టరేట్ ప్రధానం చేసిన విషయాన్ని ఆయన కూతురు మంచులక్ష్మీ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. "చెన్నైలో మా నాన్న మోహన్ బాబు ఎంజీఆర్ గౌరవ వర్శిటీ డాక్టరేట్ అందుకున్నారు..దీన్నీ మేం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అని తమ్ముడు మంచు మనోజ్‌తో దిగిన ఫొటోతో పాటు మోహన్ బాబు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఉన్న ఫోటోను లక్ష్మీ ట్వీట్ చేశారు.
We definitely could not miss this for the world! Surprised Nana in Chennai as he received his honorary doctorate from MGR University ❤ pic.twitter.com/pMYDkX8WZm
— Lakshmi Manchu (@LakshmiManchu) October 4, 2017