Dubbing Movies Telugu:
మిగతా భాషలతో పోలిస్తే ఈమధ్య కాలంలో మలయాళం ఇండస్ట్రీ వారు ఎక్కువ కంటెంట్ బేస్డ్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. చాలా వరకు వారి ఎక్స్పరిమెంటల్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక 2024 లో మలయాళం సినిమాల హవా టాలీవుడ్ లో కూడా బాగా కనిపిస్తోంది.
ఈ ఏడాది ఇంకా సగం కూడా పూర్తవలేదు కానీ అప్పుడే మలయాళ ఇండస్ట్రీ కేవలం నాలుగు సినిమాలతోనే 500 కోట్ల కలెక్షన్లను అందుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఇందులో ఒక్కటి కూడా విజువల్ గ్రాండియర్ ఉన్న సినిమా కాదు. కనీసం భారీ గ్రాఫిక్స్ వాడిన సినిమా కూడా కాదు.
ఇవి ఏమీ లేకుండా కూడా మలయాళం ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే ఈ ఏడాది విడుదలైన సినిమాలలో మలయాళం ఇండస్ట్రీ పేరు మారుమ్రోగేలా చేసిన సినిమా మంజుమ్మల్ బాయ్స్. ఇప్పటికే 2:30 కోట్ల కలెక్షన్లను దాటేసి టాప్ వన్ వైపు పరుగులు తీస్తోంది ఈ చిత్రం. మలయాళం లో బ్లాక్ బస్టర్ అయినా ఈ సినిమా ఏప్రిల్ 6 న తెలుగులో కూడా విడుదలయింది. ఇక తెలుగు కలెక్షన్లను కూడా కలిపితే సినిమా ఫైనల్ రన్ మ్యాజిక్ ఫిగర్ ను సృష్టిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ సినిమా కంటే ముందు విడుదలైన ప్రేమలు సినిమా 150 కోట్లను దాటింది. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) కూడా విజయవంతంగా 100 కోట్ల క్లబ్బులో చేరింది.
స్లో నెరేషన్ వల్ల మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు కానీ మలయాళం లో మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. మమ్ముట్టి భ్రమయుగం కూడా అంతే హిట్ అయ్యింది. టాలీవుడ్ లో ఫ్లాప్ అయినా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లు దాటేసింది. ఇవన్నీ కలుపుకుంటే 500 కోట్లు వచ్చేసినట్టే.
ఈ సంవత్సరం ఏ భాష లో కూడా ఇన్ని బ్లాక్ బస్టర్లు లేవు. కౌంట్ పరంగా టాలీవుడ్ లో హిట్లు ఉన్నాయి కానీ బడ్జెట్ పరంగా చూస్తే ఎక్కువ ఖర్చు అవుతోంది కాబట్టి పెట్టుబడి రాబడి చూస్తే తెలుగు ఇండస్ట్రీ ది రెండో స్థానమని అనచ్చు. సినిమాల పరంగా చూస్తే హను మ్యాన్ బ్లాక్ బస్టర్ ను ఇప్పట్లో ఎవరూ దాటలేరు. టిల్లు స్క్వేర్ కూడా భారీ విజయాన్ని సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Malayalam Movies: మలయాళం సినిమాల హవా.. ఏకంగా 500 కోట్లు వసూళ్లు..