Free Movie Ticket: మూవీ నచ్చకపోతే డబ్బు వాపస్.. ఎక్కడ? ఏ థియేటర్లో అంటే..?

Movie Ticket Refund: సినిమా.. కథ,  కంటెంట్ బాగుంటే ఎటువంటి ఆఫర్స్ ప్రకటించక పోయినా, ఆడియన్స్ థియేటర్ కి వచ్చి వందల రూపాయలు ఖర్చుపెట్టి మరీ సినిమాను చూస్తారు. ఉదాహరణకు  పుష్ప 2 సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది కాబట్టి ఒక్కో టికెట్ ధర రూ.3,000 పెట్టి మరీ సినిమా వీక్షించిన సందర్భాలు ఉన్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 21, 2024, 11:00 AM IST
Free Movie Ticket: మూవీ నచ్చకపోతే డబ్బు వాపస్.. ఎక్కడ? ఏ థియేటర్లో అంటే..?

PVR Inox: ఈ మధ్యకాలంలో ఎక్కువగా థియేటర్ యాజమాన్యం ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఊహించని ఆఫర్లను అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక థియేటర్ యాజమాన్యం సినిమా నచ్చకపోతే డబ్బు వాపస్ అంటూ ఆడియన్స్ కి సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మరి అది ఏ థియేటర్ ? ఎక్కడ? ఏ సినిమా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం

భారతదేశంలోని అతిపెద్ద స్క్రీన్లు కలిగినటువంటి సినిమాటిక్ థియేటర్లలో  PVR INOX కూడా ఒకటి.  వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ అగ్రశ్రేణి ఐనాక్స్ కొత్త ప్రయోగానికి తెరలేపింది.  ఈ కొత్త విధానం ప్రకారం సినిమా థియేటర్ కి ప్రేక్షకులు సైతం క్యూ కట్టేలా కనిపిస్తూ ఉన్నారట.. అదేమిటంటే ప్రేక్షకులకు సినిమా నచ్చకపోతే, ఈ సినిమా చూసే సమయంలో బయటికి వెళ్లిపోతే ఖచ్చితంగా టికెట్ ధరలలో కొంత భాగాన్ని సైతం తిరిగి ఇస్తుందట. అయితే సినిమా సమయాన్ని బట్టి ప్రేక్షకులు ఎంత సమయాన్ని చూశారు అనే అంశాల అనుగుణంగానే డబ్బులను తిరిగి ఇస్తుందట. 

ఇది విన్న సినీ ప్రేక్షకులు సైతం అందరూ ఆశ్చర్యపోతున్నారు..PVR INOX చేస్తున్న ఈ పని చాలా కొత్తగా ఉందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుని మొదటిసారి ఢిల్లీ ప్రాంతంలో మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.. ఢిల్లీలో ఒకవేళ ఇది సక్సెస్ అయితే దీని ఫలితాలు బాగుంటే దేశవ్యాప్తంగా వీటిని అమలు చేసే విధంగా PVR ప్లాన్ చేస్తోందట. 

అయితే ఈ ప్రోగ్రాం కోసం కొంతమేరకు అదనపు చార్జీలను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. టికెట్ ధరపై 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందట. మనం ఎన్నోసార్లు చూసిన సినిమాలు నచ్చకపోయినా టికెట్ డబ్బులు వృధా అవుతుందని ఉద్దేశంతోనే అలాగే థియేటర్లో కూర్చొనే చాలామంది ఉంటారు. అలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి PVR INOX ఇలాంటి ఉపయోగకరమైన పని చేయబోతున్నట్లు వెల్లడించింది.. 

ఒకవేళ ఇది అమలులోకి వస్తే ప్రేక్షకుల అనుభవాలను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు PVR INOX. మరి వీరు చేపడుతున్న ఈ కొత్త విధానం ఎంతవరకు విజయవంతంగా అవుతుంది? దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంత మేరకు ఆకట్టుకుంటుందో? అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

Also Read: Bank Merger:  ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్..తెలంగాణలో ఈ  బ్యాంక్ కనిపించదు..డిసెంబర్ 27లోపు పనులన్నీ పూర్తి చేసుకోండి

Also Read:PM Kisan: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News