Kurchi Madathapetti Full Song: సంక్రాంతికి ఊర మాస్.. కుర్చీ మడత పెట్టి ఫుల్ సాంగ్ చూశారా..!

Guntur Kaaram: ప్రోమో విడుదలైన దగ్గర నుంచి మహేష్ బాబు ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఇలా మాస్ సాంగులో కనిపించడంతో మహేష్ అభిమానులు ఈ ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నిన్నటి నుంచి ఆత్రుతగా ఎదురు చూశారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2023, 05:10 PM IST
Kurchi Madathapetti Full Song: సంక్రాంతికి ఊర మాస్.. కుర్చీ మడత పెట్టి ఫుల్ సాంగ్ చూశారా..!

Kurchi Madathapetti: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా గుంటూరు కారం. సంక్రాంతికి విడుదల కాబోయే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు.. పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ స్పెషల్ అంటూ నిన్న విడుదల చేసిన కుర్చీ మడత పెట్టి ప్రోమో సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది.

ఈ చిత్రం ఫుల్ సాంగ్ ఈరోజు డిసెంబర్ 30న విడుదల చేస్తాము అని మేకర్స్ ఆ ప్రోమోలో ప్రకటించడంతో.. ఈరోజు ఉదయం నుంచి మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఎట్టకేలకు ఈ సాంగ్ కొద్ది నిమిషాల క్రింద యూట్యూబ్లో విడుదలయింది. మాస్ బీట్ తో తెరకెక్కిన ఈసాంగ్ మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఆ కుర్చీని మడత పెట్టి డైలాగ్ తో ఈ సాంగ్ ను తెరకెక్కించారు.“రాజమండ్రి రాగమంజరి.. మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రీ.. కళాకారుల ఫ్యామిలీ మరీ.. మేగజ్జ కడితే నిదరపోదు నిండు రాతిరి” అంటూ ఈ సాంగ్ మొదలైంది. “ఆ కుర్చీని మడతపెట్టి” అంటూ డీజే సాంగ్‍లా ఈ పాట ఒక లెవెల్ కి వెళ్లి ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. 

ఈ సాంగ్‍కు మంచి ఊపున్న మాస్ బీట్‍ను సంగీత దర్శకుడు ఎస్.థమన్ అందించారు. సాహితి చాగంటి, శ్రీకృష్ణ ఈ సాంగ్‍ను పాడగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

ఈ సాంగ్ లో మహేష్ బాబు శ్రీ లీల డాన్స్ ఇరగదీశారు. నిన్న విడుదలైన ప్రోమోతోనే ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం అయిపోయింది. ఇక పూర్తి పాట ఈరోజు విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్ థియేటర్స్ లో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. సంక్రాంతికి ఉర మాస్ సాంగ్ అంటే ఇదేనేమో అనేలా చేస్తుంది ఈ పాట. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటని ఒకసారి చూసేయండి. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News