Hansika Motwani Injection: హన్సిక పెరిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు.. అసలు విషయం చెప్పేసిందిగా!

Hansika Motwani Latest Comments:  హన్సిక తల్లి ఆమె హీరోయిన్ గా మారడం కోసం వయసు ఎక్కువగా కనిపించడం కోసం కొన్ని హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిందంటూ అప్పట్లో ప్రచారం జరగగా ఆ విషయం మీద హన్సిక క్లారిటీ ఇచ్చింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 18, 2023, 06:27 PM IST
Hansika Motwani Injection: హన్సిక పెరిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు.. అసలు విషయం చెప్పేసిందిగా!

Hansika Motwani on Harmone Injection: బాంబేలో సెటిల్ అయినా ఒక సింధీ ఫ్యామిలీలో జన్మించిన హన్సిక మోత్వాని చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆసక్తితో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ముందుగా హవా అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె కోయి మిల్ గయా సినిమాతో బాలనటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీలోనే జాగో, హం కౌన్ హై, అబ్రక దబ్రా వంటి సినిమాలలో ఆమె నటించింది. దేశముదురు సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సౌత్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంది.

ఏకంగా ఆ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ సౌత్ విభాగానికి గాను ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఇక దేశముదురు తర్వాత తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అలా కంత్రి, మస్కా, బిల్లా, జైఈభవ, సీతారాముల కళ్యాణం, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, సంథింగ్ సంథింగ్, పాండవులు పాండవులు తుమ్మెద, పవర్, సైజ్ జీరో, లక్కునోడు, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆమె బాలనటిగా కనిపించి హీరోయిన్గా మారేందుకు రెండు మూడేళ్ల సమయమే ఉండడంతో ఆమె తల్లి ఆమె హీరోయిన్ గా మారడం కోసం వయసు ఎక్కువగా కనిపించడం కోసం కొన్ని హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

వయసు తక్కువే అయినా ఎక్కువగా కనిపించేందుకు ఆమె తల్లి అలా చేసిందని అందరూ భావించారు. అయితే తాజాగా ఈ విషయం మీద హన్సిక అని క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యనే హన్సికా తన ప్రియుడిని వివాహం చేసుకుంది. ఆ వివాహ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ కొనుక్కుని స్ట్రీమింగ్ చేస్తోంది. లవ్ షాది డ్రామా అనే పేరుతో ఈ స్ట్రీమింగ్ అవుతుండగా అందులోనే ఈ విషయం మీద హన్సిక క్లారిటీ ఇచ్చింది. తాను త్వరగా పెరిగేందుకు తన తల్లి తనకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిందంటూ వస్తున్న పుకార్ల మీద స్పందించిన ఆమె తాను ఎనిమిదేళ్లకే నటిని అయ్యానని అయితే తాను త్వరగా పెరిగేందుకు తన తల్లి హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చిందని చాలామంది చెత్త వాగుడు వాగారని అన్నారు.

ఒకవేళ అదే నిజం అయి ఉంటే అప్పటినుంచి నేను కష్టపడిన డబ్బుతో టాటా బిర్లాల కంటే ధనవంతురాలిని అయ్యేదాన్ని కదా అని ఆమె ప్రశ్నించారు. ఇక అసలు ఏమాత్రం ఆలోచించకుండా అలా రాయడానికి కాస్త అయినా కామన్ సెన్స్ ఉండాలి కదా అంటూ ఆమె ప్రశ్నించింది. అయితే హన్సిక ప్రస్తుతం వివాహం చేసుకున్న వ్యక్తి హన్సిక స్నేహితురాలి భర్త అని వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి కూడా హన్సిక కారణమని ఒక రకమైన ప్రచారం జరుగుతూ రావడంతో ఆ విషయం మీద కూడా హన్సిక క్లారిటీ ఇచ్చింది. తన స్నేహితురాలు భర్తే అని తనకు ముందే తెలుసని వారిద్దరికీ ముందు నుంచి గొడవలు అవుతున్నాయి అనే విషయం తనకు తెలుసు అని కూడా ఆమె పేర్కొంది. అయితే తన వల్ల వారి మధ్య ఎలాంటి ఇబ్బంది రాలేదని ఈ సందర్భంగా హన్సిక క్లారిటీ ఇచ్చింది.

Also Read: Balakrishna vs Pawan: మొన్న అన్నతో ఈ సారి తమ్ముడితో.. బాలయ్య ఎక్కడా తగ్గట్లేదుగా!

Also Read: Taraka Ratna Biography: ప్రపంచంలో మరే హీరోకి సాధ్యం కాని రికార్డు.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. తారకరత్న గురించి ఈ విషయాలు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News