HBD Allu Arjun : గంగోత్రి నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ సినీ ప్రస్థానం.. ఈ బర్త్ డే ఐకాన్ స్టార్‌కు వెరీ స్పెషల్..

HBD Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే వెనకాల మెగా అండ్ అల్లు అనే పెద్ద బ్యాక్ గ్రౌండ్ వుంది. అయిన తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 8, 2024, 07:20 AM IST
HBD Allu Arjun : గంగోత్రి నుంచి పుష్ప  వరకు అల్లు అర్జున్ సినీ ప్రస్థానం.. ఈ బర్త్ డే ఐకాన్ స్టార్‌కు వెరీ  స్పెషల్..

HBD Allu Arjun :చేసినవి కొన్ని చిత్రాలైనా.. తనదైన యాక్టింగ్, డాన్సింగ్, ఫైట్స్‌తో టాలీవుడ్‌లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతింతై అన్నట్టు వెనకాల  మెగా అల్లు వంటి  ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనే కేరళలో స్టార్‌ హీరోగా సత్తా చాటాడు. అంతేకాదు గంగోత్రి సినిమాతో హీరోగా మొదలైన ప్రస్థానం నేటికి అప్రతిహతంగా కొనసాగుతోంది. అల్లు రామలింగయ్య మనవడిగా.. అల్లు అరవింద్ కుమారుడిగా.. అల్లు అర్జున్ వెండితెర ఎంట్రీకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. 1983లో ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతలుకు రెండో పుత్రుడు. బాల నటుడిగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన 'విజేత'లో బాల నటుడిగా పరిచయమయ్యాడు. అంతేకాదు కమల్ హాసన్ స్వాతిముత్యంలో కూడా నటించాడు.
 
ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'డాడీ'లో చిన్న పాత్రలో మెరిసాడు. ఇక అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చినపుడు ఎవరీ కుర్రాడు మరీ ఇలా ఉన్నాడు..? బ్యాగ్రౌండ్ ఉంటే హీరో అయిపోవచ్చా.. ? ప్రేక్షకులపై రుద్దడమేనా అని కామెంట్స్ వినిపించాయి. బహుశా తెలుగులో మరే నట వారసుడిపై ఈ రేంజ్ విమర్శలు రాలేదు. గంగోత్రి సినిమా చూసిన వాళ్లు వీడేంటి ఇలా ఉన్నాడు అన్న వాళ్లే.. ఆ తర్వాత అల్లు అర్జున్ ను చూసి వావ్ అని ప్రశంసలు కురిపించుకునేలా చేసాడు.

గంగోత్రి హీరోగా మొదలైన అల్లు అర్జున్ నట ప్రస్థానం.. పుష్ప వరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఇక 2021 యేడాది గాను పుష్ప సినిమాలోని నటకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. అల్లు అర్జున్ కంటే మేటి నటులు తెలుగులో చాలా మంది ఉన్నా.. ఈ అవార్డు తొలి సారి అందుకున్న హీరోగా తన పేరిట ఓ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ .. అల్లు అర్జున్ పై ఓ డాక్యుమెంటరీ చేసింది. మన దేశంలో ఈ ఘనత అందుకున్న తొలి హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలను ప ఎట్టే మేడమ్ టుస్సాడ్స్‌ వాల్లు అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో పెట్టారు. మరోవైపు త్వరలో పుష్ప 2 మూవీతో పలకరించబోతున్నారు. ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా మరి కాసేపట్లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఏది ఏమైనా నేషనల్ అవార్డుతో పాటు మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువైన తర్వాత వస్తోన్న పుట్టినరోజు కావడం అల్లు అర్జున్‌కు ప్రత్యేకం అని చెప్పాలి. 

Also Read: Klin Kaara: గుండు చేయించుకున్న రామ్‌చరణ్‌ కుమార్తె క్లీంకార.. ఎందుకంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News