Happy Birthday Rashmika Mandanna: 3 డిగ్రీలు..12 ఏళ్ల చెల్లి.. రష్మిక గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు

Rashmika Mandanna Birthday Special: నేషనల్ క్రష్ గా పేరున్న రష్మిక మందన్న గురించి అన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయి, అయితే మీకు తెలియని కొన్ని విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 7, 2023, 04:31 PM IST
Happy Birthday Rashmika Mandanna: 3 డిగ్రీలు..12 ఏళ్ల చెల్లి.. రష్మిక గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు

Unknown facts of Rashmika Mandanna: కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన్న చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది, ప్రస్తుతానికి టాలీవుడ్ ఆ తమిళంలోనూ బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి తెలియని కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

రష్మిక మందన్న్న ఎక్కడ జన్మించింది..? 
రష్మిక మందన్న కర్ణాటకలోని కొడగు అనే ప్రాంతంలోనే పుట్టి పెరిగింది. దాన్ని కూర్గ్ అని కూడా పిలుస్తారు. ఆమె ఏప్రిల్ 5 1994వ సంవత్సరంలో జన్మించింది. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో తన స్కూలింగ్  పూర్తి చేసింది.

రష్మిక కుటుంబ సభ్యులు ఎవరెవరు..?
రష్మిక మందన్న్న తల్లిదండ్రులు, చిట్టి చెల్లెలుతో నివసిస్తూ ఉంటుంది. ఆమె తండ్రి పేరు మదన్ కాగా తల్లి పేరు సుమన్. రష్మికకు వయసులో చాలా వ్యత్యాసం ఉన్న చెల్లెలు కూడా ఉంది ఆమె పేరు షిమన్.

Also Read: Kiccha Sudeep Letters: ప్రైవేట్ వీడియోలు పోస్ట్ చేస్తా..పొలిటికల్ ఎంట్రీ రోజే సుదీప్ కి బెదిరింపులు

రష్మిక మందన్న ఏం చదివింది..?
రష్మికకు మూడు డిగ్రీలు ఉన్నాయి. ఆమెకు సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉంది అలాగే ఆమె జర్నలిజంలో, ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా బ్యాచిలర్ డిగ్రీలు పొందింది. ఈ డిగ్రీలన్ని ఆమె రామయ్య కాలేజ్ నుంచి పొందింది.

రష్మిక మందన్న సినీ పరిశ్రమలో ఎలా ఎంట్రీ ఇచ్చింది..?
రష్మిక మందన్న చదువుకుంటున్న సమయంలోనే అంటే దాదాపు 2012 వ సంవత్సరంలోనే మోడలింగ్ మొదలుపెట్టింది. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ 2014 అవార్డ్ అందుకున్న తర్వాత ఆమెకు సినీ పరిశ్రమ మీద ఆసక్తి పెరిగింది.

రష్మిక మందన్న మొదటి సినిమా అవకాశం ఎలా దక్కించుకుంది..?
రిషబ్ శెట్టి డైరెక్టర్ గా తెరకెక్కిన కిరిక్ పార్టీ సినిమా కోసం కొత్త అమ్మాయిని వెతుకుతున్న సమయంలో ఆయన కంట రష్మిక పడడంతో ఆమెను హీరోయిన్గా తీసుకున్నారు. 2016 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా మారింది.

ప్రస్తుతం రష్మిక మందన్న రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి..?
రష్మిక కిరిక్ పార్టీ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయింది. అయితే 2018 లో వారిద్దరూ దాని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే రష్మిక విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో ఉందని ప్రచారం జరుగుతోంది కానీ ఆ విషయం మీద క్లారిటీ లేదు.

Also Read: Where Is Pushpa: పుష్ప మిస్సింగ్.. ఇంట్రెస్టింగ్ గా పుష్ప ది రూల్ అప్డేట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News