Jeremy Renner : ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన హాక్ ఐ నటుడు.. 30 ఎముకలు విరిగాయన్న జెరెమీ రెన్నెర్

Jeremy Renner Discharged from Hospital హాలీవుడ్ నటుడు జెరెమీ రెన్నెర్ ప్రస్తుతం క్షేమంగానే ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 01:16 PM IST
  • ప్రమాదం నుంచి కోలుకున్న హాలీవుడ్ నటుడు
  • హాక్ ఐ నటుడు పరిస్థితి ఎలా ఉందంటే?
  • నలభై ఎముకల దెబ్బతిన్నాయన్న జెరెమీ రెన్నెర్
Jeremy Renner : ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన హాక్ ఐ నటుడు.. 30 ఎముకలు విరిగాయన్న జెరెమీ రెన్నెర్

Jeremy Renner Accident అవెంజర్స్‌లో కీలకపాత్ర ధారి అయిన హాక్ ఐ నటుడు జెరెమీ రెన్నెర్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన ఇంటి వెలుపల మంచును తొలగిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడని విషయం విదితమే. రెండు వారాల పాటు హాస్పత్రిలో చికిత్స తీసుకున్న అతను ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ ప్రమాదంలో ఆయనకు నలభై ఎముకలు ఫ్రాక్ఛర్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెబుతూ ఆయన వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఈ ఏడాది నాకు మార్నింగ్ వాక్స్, కొత్త తీర్మానాలు తీసుకోవడం నాకు సవాలుగానే మారేట్టుంది. అనుకోని ఈ ప్రమాదం వల్ల నా కుటుంబం అంతా కూడా షాక్ అయింది.. మీరు నాపై ఎంతో ప్రేమను కురిపించారు.. మీరు చూపించిన ప్రేమకు, అందించిన ప్రార్థనలకు థాంక్స్. ముప్పైకి పైగా ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. త్వరలోనే రెట్టింపు వేగం, బలంతో తిరిగి వస్తాను అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అభిమానులు చూపించిన ప్రేమకు థాంక్స్ చెబుతూ వేసిన ఈ పోస్ట్ మీద హాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Trending News