Prabhas: కోటికి పైగా ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్ ప్రథమంగా ఎవరిని ఫాలో అవుతారంటే..?

Prabhas Instagram Followers: కోటికి పైగా ఫాలోవర్స్ ను ఇంస్టాగ్రామ్ లో కలిగే ఉన్న ప్రభాస్ మొదటగా తన పెదనాన్న కృష్ణంరాజుతో పాటు 23 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారు.  ఏది ఏమైనా ఇంతమంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ప్రభాస్,  కేవలం 23 మందిని మాత్రమే ఫాలో..అవుతున్నారంటే నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 14, 2024, 01:44 PM IST
Prabhas: కోటికి పైగా ఫాలోవర్స్ ఉన్న ప్రభాస్ ప్రథమంగా ఎవరిని ఫాలో అవుతారంటే..?

List of Celebrities Prabhas Follow on Instagram : ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్.. కల్కి, సలార్ సినిమాలు ఇచ్చిన బూస్ట్ తో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్నారు. ఇప్పుడు సలార్ 2,  కల్కి 2,  స్పిరిట్,  రాజా సాబ్ చిత్రాలను లైన్ అప్ చేశారు. ఇకపోతే బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్న ఈయన .. త్వరలో రాజా సాబ్ సినిమాని విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 10వ తేదీన వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ హారర్ కామెడీ బ్యాక్ గ్రౌండ్ సినిమా కూడా చేయబోతున్నారని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ప్రభాస్ కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. సాధారణంగా ప్రభాస్ తన సినిమాల ఫంక్షన్లను తప్పించి పెద్దగా బయట కనిపించరు. అయితే సోషల్ మీడియాలో కూడా రీసెంట్ గానే ఆయన అకౌంట్ ఓపెన్ చేసినట్లు సమాచారం.  అందులో కూడా పెద్దగా అప్డేట్స్ కూడా ఏమీ పెట్టడు. ఏదో సినిమాలను ప్రమోట్ చేయడానికి మినహా మరే ఇతర విషయాలను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకోరు. 

ఇక పర్సనల్ విషయాల గురించి అసలే పట్టించుకోరు. అయినప్పటికీ కూడా ఫేస్ బుక్,  ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు ప్రభాస్.  ముఖ్యంగా ఇన్స్టాలో ప్రభాస్ 12.8 మిలియన్ మెంబర్స్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ని ఎంతమంది ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎవరెవరిని ఫాలో అవుతున్నాడో తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. ఆయన కేవలం 23 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో మొదట కనిపించే పేరు తన పెదనాన్న కృష్ణంరాజు. ఆ తర్వాత నాగ్ అశ్విన్,  మారుతి,  రాజమౌళి, సందీప్ రెడ్డి, రాధాకృష్ణ , సుజిత్,  హను రాఘవపూడి పేర్లు ప్రధమంగా కనిపిస్తాయి. అలాగే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ , పృథ్వీరాజ్ సుకుమారన్ , సన్నీ సింగ్ లను ఈయన ఫాలో అవుతున్నారు.

హీరోయిన్స్ విషయానికి వస్తే యంగ్ బ్యూటీ ఇమాన్వి, పూజా హెగ్డే, దీపికా పదుకొనే, మాళవిక మోహన్, సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ, నిధి అగర్వాల్, శ్రద్ధా కపూర్, శృతిహాసన్, రిద్దీ కుమార్, కృతి సనన్ లను ఈయన ఫాలో అవుతున్నారు.

Also Read: AP Floods: 'డబ్బులు ఊరికే రావు' యజమాని ఏపీ వరదలకు భారీ విరాళం

Also Read: Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News