Hero Arvind Krishna's "S.I.T" first look released: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలా పెద్ద సినిమాలా అని ప్రేక్షకులు చూడడం లేదు, కంటెంట్ నచ్చితే ఎలాంటి సినిమా నైనా ఆదరించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న సినిమాల మేకర్స్ కూడా పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
తాజాగా అరవింద్ కృష్ణ రజత్ రాఘవ్ హీరోలుగా ఎస్ఐటి అనే సినిమా రూపొందుతోంది. నటాషా దోషి హీరోయిన్ పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంద. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్- వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లపై అరవింద్ కృష్ణ రజత్ రాఘవ్ హీరోలుగా నటాషా దోషి కీలకపాత్రలో నటిస్తోన్న సినిమాకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ట్యాగ్ లైన్. వీబీఆర్ టీమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని అప్డేట్స్ విడుదలయ్యాయి.
తాజాగా ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించినట్టు తెలిసింది. స్క్రీన్ ప్లే ఆధారంగానే ఈ సినిమా అద్భుతంగా కుదిరిందని సినిమా మొత్తానికి స్క్రీన్ ప్లే హైలెట్గా నిలుస్తుంది అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కౌశిక్ మేకల, అనిల్ రాథోడ్, రుచిత సాధినేని వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుండగా సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి ఎస్ నాగిరెడ్డి తేజ్ పల్లి గుంటక శ్రీనివాస్ రెడ్డి ప్రొడ్యూసర్స్ వ్యవహరిస్తుండగా కే చంద్రబాలిరెడ్డి,రమేష్ గుండా , నరేంద్ర వాసిరెడ్డి , వంటి వారు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరికుప్పల యాదగిరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రచన దర్శకత్వం వి వి ఆర్ చూసుకుంటున్నారు.
Also Read: Harish shankar Serious: మీరు లైన్ దాటారు.. పవన్ ఫాన్స్ పై హరీష్ శంకర్ సీరియస్
Also Read: Taraka Ratna Health Update Latest: నా గుండె పగిలిపోయింది..నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook