Mahesh Babu - Gopichand: సూపర్ కాంబో.. మహేష్‌‌ బాబు సినిమాలో విలన్‌‌గా తెలుగు స్టార్ హీరో!!

Gopichand to act as Vilan in Mahesh Babu Film. మహేశ్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‌‌గా మ్యాచో స్టార్ గోపీచంద్ నటించనున్నాడని సమాచారం తెలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 04:23 PM IST
  • రాజమౌళి దర్శకత్వలో మహేష్ సినిమా
  • మరోసారి సూపర్ స్టార్‌తో తలపడనున్న మ్యాచో స్టార్
  • మహేష్‌‌ బాబు సినిమాలో విలన్‌‌గా తెలుగు స్టార్ హీరో
Mahesh Babu - Gopichand: సూపర్ కాంబో.. మహేష్‌‌ బాబు సినిమాలో విలన్‌‌గా తెలుగు స్టార్ హీరో!!

Gopichand in Mahesh Babu's New Film: టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేశ్ బాబు (Mahesh Babu) చేతిలో వరుసగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ 'సర్కారి వారి పాట' సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌‌ శ్రీనివాస్ (Trivikram Srinivas)తో మహేష్ సినిమా చేయనున్నారు. ఇక ఫాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబో కూడా త్వరలో మొదలవనుంది. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వలో మహేష్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం మహేశ్ బాబు - రాజమౌళి (Mahesh Babu - SS Rajamouli)సినిమాకు సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ - రాజమౌళి సినిమాలో విలన్‌‌గా మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) నటించనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే గోపీచంద్‌‌ని రాజమౌళి సంప్రదించారని.. విలన్‌‌గా చేసేందుకు ఆయన ఒప్పుకున్నాడని ఫిలింనగర్ టాక్. ఇదే నిజమయితే మహేష్‌‌ - గోపీచంద్‌‌ (Mahesh Babu - Gopichand) కలిసి నటించడం రెండోసారి అవుతుంది. 

Also Read: Hamsa Nandini Photoshoot: క్యాన్సర్‏తో పోరాటం.. గుండుతో హీరోయిన్ ఫోటోషూట్! నా లవ్ కోసం బలంగా తిరోగిస్తా!

తేజ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన 'నిజం' సినిమాలో గోపీచంద్ విలన్‌‌గా (Gopichand Vilan) నటించారు. మహేష్‌‌ - గోపీచంద్‌‌ కాంబో అప్పుడు సూపర్ హిట్ అయింది. అందుకే తన సినిమాలో విలన్‌‌గా గోపీచంద్‌‌ని తీసుకోవాలని రాజమౌళి పట్టుబడుతున్నాడట. గతంలో వర్షం సినిమాలో కూడా గోపీచంద్ విలన్‌‌గా చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' అనే మూవీని చేస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌‌గా నటిస్తున్నారు.

ఇటీవలి కాలంలో స్టార్ హీరోయిన్‌లు ఐటెం సాంగ్స్ బయటపడుతుంటే.. హీరోలు విలన్‌‌గా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా విలన్‌‌గా సినిమాలు చేస్తున్నారు. సునీల్ శెట్టి, విజయ్ సేతుపతి, జగపతి బాబు, శ్రీకాంత్, కార్తికేయ, సుదీర్ బాబు, మాధవన్, అరవింద స్వామి, నవదీప్, రాణా లాంటి హీరోలు ఇప్పటికే విలన్‌‌లుగా సత్తాచాటారు. నిజం చెప్పాలంటే వీరికంటే ముందే విలన్‌‌గా చేసిన గోపీచంద్‌‌ హీరోగా నిలుదొక్కుకోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చాడు.  

Also Read: Mahesh Babu NBK: గౌతమ్ నా చెయ్యి అంత పుట్టాడు.. డబ్బుండి కాబట్టి సరిపోయింది! లేని వాళ్ల పరిస్థితేంటనే ఇలా చేస్తున్నా: మహేష్ బాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News