Hrithik Roshan : ఇంట తీవ్ర విషాదం.. సినీ ప్రముఖుల సంతాపం

Sadness at Hrithik Roshan Home : హృతిక్ రోషన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అందరూ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 07:30 PM IST
  • హృతిక్ రోషన్ ఇంట తీవ్ర విషాదం
  • సినీ ప్రముఖుల సంతాపం
  • ఎమోషనల్ అయిన హృతిక్ తల్లి
Hrithik Roshan : ఇంట తీవ్ర విషాదం.. సినీ ప్రముఖుల సంతాపం

Sadness at Hrithik Roshan Home : విడాకుల తర్వాత సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఇప్పుడిప్పుడే సభా ఆజాద్ తో కొంచెం బయట కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన మరోసారి జీవితంలో బ్యాడ్ ఫేజ్ ఎదుర్కొంటున్నారు. ఆయన ఇంటి నుంచి ఒక బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. హృతిక్ రోషన్ అమ్మమ్మ పద్మా రాణి ఓంప్రకాష్ ముంబైలో కన్నుమూశారు. పద్మా రాణి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హ్రితిక్ తల్లియిన పింకీ రోషన్ తల్లయిన పద్మా రాణి ఓం ప్రకాష్ వయస్సు 91 సంవత్సరాలు.  
 
హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తన అత్త పద్మ రాణి మరణాన్ని ధృవీకరించారు. హృతిక్ తన అమ్మమ్మతో చాలా సన్నిహితంగా ఉండేవాడని,  ఆమె ఆమె మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారని తెలుస్తోంది. పద్మా రాణి ఓంప్రకాష్ చాలా రోజుల నుంచి అనారోగ్య రీత్యా మంచానికే పరిమితం అయ్యారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమె మరణించారని తెలుస్తోంది. పద్మా రాణి సినిమా నిర్మాత జె ఓం ప్రకాష్ భార్య.  ఓం ప్రకాష్ 7 ఆగస్టు 2019న మరణించారు. 

ఇక కరోనా ప్రారంభం అయిన నాటి నుంచి పద్మ రాణి ఓంప్రకాష్ రాకేష్ రోషన్ కుటుంబంతోనే నివసిస్తున్నారు. పింకీ రోషన్ తన తల్లి ఫోటోలను సోషల్ మీడియాలో అడపా దడపా షేర్ చేసేది. ఆ ఫోటోలలో కూడా పద్మ రాణి ఓంప్రకాష్ మంచం మీద పడుకుని కనిపించేది. తన తల్లి మరణం తరువాత కూడా,  పింకీ రోషన్ నివాళులర్పించింది . ఆమె యొక్క చాలా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం ద్వారా సంతాపం వ్యక్తం చేసింది. 

'మా అమ్మ పద్మా రాణి ఓంప్రకాష్ మా నాన్నను తిరిగి కలవడానికి వెళ్తూ మమ్మల్ని విడిచిపెట్టారు అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఈ వార్త బయటకి వచ్చిన తర్వాత,  చాలా మంది సోషల్ మీడియా యూజర్లు,  సెలబ్రిటీలు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెప్పాలంటే ఆయన వరుస సినిమాలు లైన్లో పెట్టారు. రానున్న రోజుల్లో దీపికా పదుకొణెతో ఫైటర్,  సైఫ్ అలీఖాన్‌తో విక్రమ్ వేద వంటి సినిమాల్లో నటించనున్నాడు. ఈ రోజుల్లో ఎక్కువగా హృతిక్ సబా ఆజాద్‌తో అఫైర్ వ్యవహారంలోనే వార్తలలో నిలుస్తున్నారు. ఆమెతో బయటకు వచ్చిన ప్రతి సారీ ఆయన ఫోటోలు-వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.  
 
Also Read:హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి నా హృదయం ముక్కలైపోయింది.. స్టార్ హీరోయిన్ ఆవేదన!

Also Read:Hrithik Roshan-Sussanne Khan: హవ్వ.. ఇదెక్కడి లవ్ స్టోరీ.. లవర్స్‌‌తో మాజీ భార్యాభర్తలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News