Bharateeyudu 2: మూడవ రోజు ఇండియన్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. ఇంకా తగ్గిపోయిన కలెక్షన్స్

Bharateeyudu 2 Day 3: మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ అందుకుంటున్న కమల్ హాసన్ భారతీయుడు 2.. సినిమా.. మూడు నెలల రోజు కలెక్షన్లు.. ఇంకా తక్కువ కలెక్షన్లు అందుకని.. డిజాస్టర్ అయ్యే దారిలో వెళుతోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 15, 2024, 01:39 PM IST
Bharateeyudu 2: మూడవ రోజు ఇండియన్ 2 బాక్సాఫీస్ వసూళ్లు.. ఇంకా తగ్గిపోయిన కలెక్షన్స్

Bharateeyudu 2 Collections: లోకనాయకుడు.. కమల్ హాసన్.. దాదాపు 28 ఏళ్ల తరువాత మళ్ళీ సేనాపతి గా తిరిగి వచ్చారు. ఇండియన్ 2 భారీ అంచనాల.. మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అయ్యింది కానీ మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ వినిపిస్తోంది. మూడవ రోజు దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 15.1 కోట్లను మాత్రమే సినిమా నమోదు చేసుకుంది.

ఇందులో తమిళ వెర్షన్ రూ. 11 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 2.8 కోట్లు, హిందీ వెర్షన్ (హిందుస్థానీ 2) రూ. 1.3 కోట్లు వసూలు చేశాయి. శనివారం (సినిమా విడుదల రెండవ రోజు) వసూళ్లతో పోలిస్తే మరింత తగ్గాయి అని చెప్పచ్చు. రెండవ రోజు తమిళంలో రూ. 13.7 కోట్లు, తెలుగులో రూ. 3.2 కోట్లు, హిందీలో రూ. 1.3 కోట్లు వసూలు చేసి, మొత్తం రూ. 18.2 కోట్ల వసూళ్లు సాధించింది ఈ సినిమా. 

మొదటి రోజు మాత్రం ఇండియన్ 2 భారీ వసూళ్లను నమోదు చేసుకుంది. మొత్తం రూ. 25.6 కోట్లను వసూలు చేసింది. (తమిళంలో రూ. 16.5 కోట్లు, తెలుగులో రూ. 7.9 కోట్లు, హిందీలో రూ. 1.2 కోట్లు). 

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సిద్దార్థ్, ఎస్.జె. సూర్య, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్, దివంగత నెడుముడి వేణు ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకు.. సంగీతం అందించాల్సిన ఏఆర్ రెహ్మాన్.. సినిమా నుండి తప్పుకోగా, అనిరుద్ రవి చందర్ రంగంలోకి దిగారు. 

రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా.. రెండవ భాగం ఇండియన్ 3 వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇండియన్ 2 సినిమా ఎలాగో డిజాస్టర్ వైపుగా పరుగులు తీస్తోంది. మరి ఇండియన్ 3 మీద అది ఎలాంటి నెగటివ్ ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. 

ఈ మధ్యకాలంలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద.. చతికిలపడుతున్నాయి. గతంలో ఎన్నో బ్లాక బస్టర్ సినిమాలకి దర్శకత్వం వహించిన శంకర్ ఇప్పుడు వరుసగా ఫ్లాప్ సినిమాలు అందుకుంటూ ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్నారు.

Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!

Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News