Ileana Baby Bump : ఇలియానా బేబీ బంప్ పిక్స్ వైరల్.. అలర్ట్ అంటూ గోవా బ్యూటీ సందడి

Ileana D'cruz Baby Bump గోవా బ్యూటీ ఇలియానా తాజాగా అందరినీ తన బేబీ బంప్‌తో ఆశ్చర్యపరిచింది. ఇలియానా తన గర్భాన్ని చూపిస్తూ తన ప్రెగ్నెన్సీ రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేసింది. ఈ మధ్య ఇలియానా బీచులో బికినీ అంటూ సందడి చేస్తూ వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2023, 09:46 AM IST
  • నెట్టింట్లో ఇలియానా సందడి
  • బేబీ బంప్ చూపించిన బ్యూటీ
  • గోవా బ్యూటీ ఫోటోలు వైరల్
Ileana Baby Bump : ఇలియానా బేబీ బంప్ పిక్స్ వైరల్.. అలర్ట్ అంటూ గోవా బ్యూటీ సందడి

Ileana D'cruz Baby Bump ఇలియానా ప్రేమ, పెళ్లి, తల్లి కావడం అనే వార్తలు నెట్టింట్లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. గోవా బ్యూటీ ఒకప్పుడు ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. ఆ తరువాత కొన్ని రోజుల పాటు సింగిల్‌గానే ఉన్నట్టు కనిపించింది. మళ్లీ ఆమె రిలేషన్ మీద రూమర్లు వచ్చాయి. బాలీవుడ్ బ్యూటీ సోదరుడితో ఇలియానా ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. ఇక చివరకు ఇలియానా తాను తల్లి కాబోతోన్నాను అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఏప్రిల్ 18న ఇలియానా ఓ పోస్ట్ వేసింది. అందులో రెండు ఫోటోలను షేర్ చేసింది. మామా (తల్లి) అంటూ ఓ లాకెట్‌ను షేర్ చేసింది. అడ్వెంచర్ బిగిన్స్ అని ఓ బుల్లి టీషర్ట్‌ను షేర్ చేసింది. త్వరలోనే రాబోతోన్నాడు.. చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇలియానా వేసిన ఈ పోస్ట్‌తో తల్లి కాబోతోందంటూ చెప్పకనే చెప్పేసింది. దీంతో ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందనే వార్తలు వైరల్ అయ్యాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ileana D'Cruz (@ileana_official)

మధ్యలో ఇలియానా కొన్ని బికినీ ఫోటోలు షేర్ చేసింది. అయితే ఇందులో ఆమె గర్భం కనిపించలేదు. బీచుల్లో బికినీలు ధరిస్తూ రచ్చ రచ్చ చేయసాగింది. అప్పుడు ఆమె బేబీ బంప్ కనిపించలేదు. దీంతో అసలు ఆమె గర్భం దాల్చిందా? లేదంటే సరోగసి ద్వారా పిల్లల్ని కంటోందా? అని అందరిలోనూ అనుమానాలు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా వాటిపై ఇలియానా క్లారిటీ ఇచ్చింది.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

తాజాగా ఇలియానా తన బేబీ బంప్‌ కనిపించేలా ఫోటోను షేర్ చేసింది. బేబీ బంప్ అలర్ట్ అంటూ తన గర్భాన్ని చూసుకుని మురిసిపోతోంది ఇలియానా. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికి కూడా ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అన్నది క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇది మన సంస్కృతికి విరుద్దం అని కొందరు అంటుంటే.. ఎవరిష్టం వారిది అంటూ మరి కొందరు ఇలియానాను సమర్దిస్తున్నారు.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News