Bihar Election 2020: ఇండిపెండెంట్ అభ్యర్థిపై కాల్పుల కలకలం..

#BiharElections2020 | విపక్ష కూటమి సీఎం అభ్యర్థిగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సక్సెస్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. మరోవైపు ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సీఎం నితీశ్ కుమార్ సానుభూతి ఓట్లు పొందే మార్గాన్ని అనుసరించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఓ స్వతంత్ర అభ్యర్థిపై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.

Last Updated : Nov 6, 2020, 02:26 PM IST
Bihar Election 2020: ఇండిపెండెంట్ అభ్యర్థిపై కాల్పుల కలకలం..

ల‌క్నో: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020 (Bihar Assembly Election 2020) గతంలో ఎన్నికలకు భిన్నంగా కొనసాగుతున్నాయి. విపక్ష కూటమి సీఎం అభ్యర్థిగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సక్సెస్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. మరోవైపు ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సీఎం నితీశ్ కుమార్ సానుభూతి ఓట్లు పొందే మార్గాన్ని అనుసరిస్తున్నారు. అయితే బిహార్ మూడో విడత ఎన్నికల ప్రచారం జరుగుతుండగా అవాంఛనీయ ఘటన జరిగింది. ఓ స్వతంత్ర అభ్యర్థిపై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.

 

మూడో విడత ఎన్నికలకు కొన్ని గంటలకు ముందు ఇండిపెండెంట్ అభ్యర్థి రవీంద్రనాథ్ సింగ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నేత ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దర్బంగాలోని హయాఘాట్ అసెంబ్లీ స్థానం నుంచి రవీంద్రనాథ్ సింగ్ స్వతంత్ర అభ్యర్థికి దిగారు. ఈ క్రమంలో ప్రచారం ముగించుకుని తిరిగొస్తుండగా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, అక్కడి నుంచి పరారయ్యారు.

 

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు చివరిదైన మూడో విడుతలో భాగంగా రేపు 16 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో  1.23 కోట్ల మంది పురుషులు, 1.12 కోట్ల మంది మ‌హిళా ఓటర్లు ఉన్నారు. మూడు విడుతలుగా జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నిలక ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News