నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. నోట్లకట్టతో పోలీస్ స్టేషన్‌కు!

Private employee honesty at ATM centre | పెద్ద నోటు ఒక్కటి దొరికినా ఎవరూ చూడకుండా చటుక్కున తీసుకుని వెళ్లిపోవడం చూస్తుంటాం . కానీ ఓ చిరుద్యోగి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి తన నిజాయితీని చాటుకున్నాడు. తనకు దొరికిన రూ.500 నోట్ల కట్టును పోలీసులకు అప్పగించాడు.

Last Updated : Nov 6, 2020, 12:52 PM IST
నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. నోట్లకట్టతో పోలీస్ స్టేషన్‌కు!

సాధారణంగా వంద రూపాయలో, లేక అంతకంటే పెద్ద నోటు ఒక్కటి దొరికినా ఎవరూ చూడకుండా చటుక్కున తీసుకుని వెళ్లిపోవడం చూస్తుంటాం . కానీ ఓ చిరుద్యోగి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి హైదరాబాద్‌లో తన నిజాయితీని చాటుకున్నాడు. తనకు దొరికిన రూ.500 నోట్ల కట్టును పోలీసులకు అప్పగించి వివరాలు చెప్పి శభాష్ అనిపించుకున్నాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

 

సీఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నిజాంపేటకు చెందిన సింహాద్రి రామకృష్ణ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన సోదరి వైద్యానికి కావాల్సిన నగదు డ్రా చేసేందుకు కరూర్‌వైశ్యా బ్యాంకు ఏటీఎం వెళ్లాడు. ఆయనకు రూ. 50వేల కట్ట (500వందల నోట్లు) ఏటీఎం సెంటర్‌లో కనిపించింది. వాటిని నేరుగా బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి ఆ చిరుద్యోగి తన నిజాయితీ చాటుకున్నాడు.

 

విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. ఏటీఎం మనీ లోడింగ్‌ టీంలో పనిచేస్తున్న (రైటర్‌ సేఫ్‌గార్డ్‌) రవికుమార్‌ మనిలోడింగ్‌ చేస్తుండగా రూ. 50వేల కట్ట పక్కకు పడిపోయింది. కేసు విచారణలో ఇది గుర్తించారు. నిజాయితీ చాటుకున్న రామకృష్ణను గురువారం సాయంత్రం బ్యాంకు అధికారులు, పోలీసులు కలిసి బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో   శాలువాతో సత్కరించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News