Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?

Pawan Kalyan-Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఎంతో మంది జైలు జీవితం గడిపి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా సినిమా సక్సెస్ అయిన సందర్భంలో అరెస్ట్ అవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 14, 2024, 06:08 PM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?

Pawan Kalyan about Allu Arjun Case: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా, అల్లు కుటుంబాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే ఒకప్పుడు ఈ మెగా ట్యాగ్ ను  ఉపయోగించుకొని అల్లు హీరోలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అల్లు అర్జున్ కూడా అలా వచ్చినవారే. ఒకప్పుడు ఆ కుటుంబాలలో ఏదైనా సమస్య వస్తే అందరూ మూకుమ్మడిగా సమస్యను సాల్వ్ చేసుకునే వాళ్ళు. 
అయితే ఇప్పుడు మాత్రం ధోరణి మారిపోయింది. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన సొంత టాలెంట్ తోనే పైకి ఎదిగారు అనేది వాస్తవం. అందులో భాగంగానే తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప -2 సినిమా చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ.1000 కోట్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. 

Also Read: Chandrababu: ప్రధాని మోదీకి చంద్రబాబు షాక్‌.. జమిలి వచ్చినా ఏపీలో ఎన్నికలు 2029లోనే

అయితే ఈ విజయాన్ని కొంతమంది ఓర్వలేక పోతున్నారనే  వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షోలో భాగంగా ర్యాలీ చేస్తూ సంధ్య థియేటర్ కి రావడంతో ఆయనపై కేసు ఫైల్ చేశారు. దీనికి తోడు అదే థియేటర్లో ఒక మహిళ మృతి చెందింది. ఇక రెండు కేసులు కూడా ఆయనపై మోపి నిన్న అరెస్టు చేశారు. 

అయితే క్వాష్ పిటిషన్ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై మద్యంతర బెయిల్ మీద నాలుగు వారాలపాటు బయటకి వచ్చారు.ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కూడా అల్లు అర్జున్ కి  సపోర్టుగా నిలిచింది.

 

 

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు అదే మేనల్లుడికి సమస్యలు వస్తే మాత్రం సీఎం చంద్రబాబుతో కలిసి నవ్వుకుంటున్నారే కానీ వచ్చి అసలు సమస్యను పరిష్కరించలేదనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి .అంతేకాదు అప్పటి పరిస్థితులను ఇప్పటి పరిస్థితులను కలిపి వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్స్. రాజకీయాలలోకి వస్తే ఆలోచనలు,  అలవాట్లు అన్ని మారిపోతాయేమో అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Danam Nagender: అల్లు అర్జున్‌ అరెస్ట్‌లో రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షాక్‌..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News