Jani Master: జానీ మాస్టర్ కి సర్ది చెప్పిన స్టార్ డైరెక్టర్.. వినకపోవడం వల్లే ఈ చిక్కంతా..!

Star Director in Jani Master Case: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సదరు మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ తో గొడవపడిన సదరు యువతి , ఇంకొక టీంలోకి చేరడంతో నచ్చక ఆమెతో గొడవ పడగా, ఒక స్టార్ డైరెక్టర్ రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 19, 2024, 03:56 PM IST
Jani Master: జానీ మాస్టర్ కి సర్ది చెప్పిన స్టార్ డైరెక్టర్.. వినకపోవడం వల్లే ఈ చిక్కంతా..!

Jani Master Case Update; ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు రోజుకొక మలుపు తీసుకుంటుంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జానీ మాస్టర్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరగగా.. తాజాగా ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

జానీ మాస్టర్ లడఖ్ లో ఉన్నట్లు సమాచారం అందించగా..  పోలీసులు అక్కడికి బయలుదేరి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే మైనర్ బాలికపై అత్యాచారం చేశారని ఆరోపణలతో జానీ మాస్టర్ పైన ఫోక్సో కేసు నమోదు చేశారు. తాజాగా ఇప్పుడు ఈ కేసు కు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. 

నిజానికి 2017 నుంచి సదరు మహిళతో జానీ మాస్టర్.. అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వార్తలు రాగా.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతోనే వేరే కొరియోగ్రాఫర్.. టీం లోకి బాధిత యువతి వెళ్లడం జరిగిందట. ఒక పెద్ద హీరో సాంగ్స్ షూటింగ్ జరుగుతున్న సమయంలో జానీ మాస్టర్ అక్కడికి వెళ్లి ఆమెతో గొడవ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇద్దరి మధ్య గొడవ బాగా పెరగడంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇద్దరినీ పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. అంతేకాదు వారిద్దరిని రాజీ చేసుకోవాలని కూడా సూచించారట. కుదరకపోతే మీ పని మీరు.. చేసుకోండని కానీ ఇలా రోడ్డున పడి అల్లరి కావొద్దు అని వారిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినా సరే తీరు మార్చుకోని జానీ మాస్టర్ ఆ మహిళా కొరియోగ్రాఫర్ ను వేధిస్తూనే ఉన్నారని,  దీంతో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై సినీ ఇండస్ట్రీ సీరియస్ గానే రియాక్ట్ అయింది.  దీనిపై మీడియా సమావేశం నిర్వహించి బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. అత్యాచార ఆరోపణలతో.. ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుందని సమాచారం. దీనికి తోడు జనసేన పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు.

Also Read: Rahu Transit 2024 Good Effect: ఈ రాశులవారికి.. 2025 జనవరి వరకు డబ్బుల వర్షమే..

Also Read: Amala Paul: పండుగ నాడు కొడుకు ముందే అతడికి లిప్ కిస్ పెట్టిన హీరోయిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News