Peda Kapu 1: శ్రీకాంత్‌ అడ్డాల మూవీ నుంచి జాతర సాంగ్ వచ్చేసింది.. మీరు చూసేయండి..

Peda Kapu 1: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న పెదకాపు 1  మూవీ నుంచి తొలి లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా రిలీజైన సాంగ్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2023, 09:07 PM IST
Peda Kapu 1:  శ్రీకాంత్‌ అడ్డాల మూవీ నుంచి జాతర సాంగ్ వచ్చేసింది.. మీరు చూసేయండి..

Peda Kapu 1 Songs:  నారప్ప తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కిస్తున్న చిత్రం పెదకాపు 1 (Peda Kapu 1). ఏ కామన్‌ మ్యాన్‌ సిగ్నేచర్‌ ట్యాగ్‌లైన్‌తో ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ ద్వారా విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా ఈ సినిమా నుంచి జాతర లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. దుర్గమ్మ జాతర నేపథ్యంలో సాగుతున్న ఈ పాటకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి పాడగా.. కళ్యాణచక్రవర్తి త్రిపురనేని రాశారు. రాజు సుందరం డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉంది. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా.. యాక్షన్ సీన్స్ ను పీటర్‌ హెయిన్స్‌ కంపొజ్ చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News