Josh Nandi Awards: జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ 2024.. విజేతలు ఎవరంటే

Josh South India Nandi Awards: హైదరాబాదులో జోష్ సౌత్ ఇండియా నంది అవార్డ్స్ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ విభాగాల్లో 2024 వ సంవత్సరంకి కానీ అవార్డులు అందజేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2024, 06:50 PM IST
Josh Nandi Awards: జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ 2024.. విజేతలు ఎవరంటే

Josh Nandi Awards:

హైదరాబాదులోని హరిహర కళాభవన్ లో జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ కార్యక్రమం హరిహర కళాభవన్ లో ఘనంగా జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 శాఖలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేసి ఈ ఈవెంట్లో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో బింబిసారా దర్శకుడు వశిష్ట, కొరియోగ్రాఫర్  ప్రేమ్ రక్షిత్, నటులు రచ్చ రవి, మాణిక్, మురళీధర్ గౌడ్, అజయ్ ఘోష్, హీరోయిన్ నేహా రెడ్డి, నటులు ప్రొడ్యూసర్ ముసఅలీఖాన్, సీనియర్, నటులు అర్జున్ రాజు, తిరుపతి దొరయ్, రెజ్లర్ భువనేశ్వరి అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో బింబసారా  డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. తాను చేసిన బింబిసారా సినిమాకు బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్స్ రావడం చాలా సంతోషం ఉందని.. "జోష్" సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

నేహా రెడ్డి  మాట్లాడుతూ... బెస్ట్ యాక్ట్రెస్ మా ఊరి సినిమాకు జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్ ఇస్తారని ఊహించలేదు.  నా టాలెంట్ ను  గుర్తించి నన్ను సెలెక్ట్ చేసిన 'జోష్ "సౌత్ ఇండియన్ చైర్మన్ "జోష్ " గారికి కృతఙ్ఞతలు తెలిపారు

కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్  మాట్లాడుతూ... RRR సినిమాలో నాటు నాటు పాటకు గాను ఈ అవార్డ్స్ తీసుకోవడం మర్చిపోలేని అనుభూతి.. అన్నారు.
నటుడు రచ్చ రవి మాట్లాడుతూ... ఈ అవార్డు రావడం చాలా సంతోషం ఉందని, తనకు ఇంత గౌరవం ఇచ్చిన"జోష్' అవార్డ్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

డీజే టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ... డీజే టిల్లు చిత్రంలో నటించిన బెస్ట్ సపోర్ట్ రోల్ కు గాను "జోష్ " సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ తీసుకోవడం చాలా సంతోషం.. జోష్ హోల్ టీం అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ చైర్మన్ సంజోష్ మాట్లాడుతూ... “తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ కనబర్చినవారికి  రెండు సార్లు జోష్ టాలెంట్  అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మూడోసారి చాలా ఘనంగా జోష్ సౌత్ ఇండియన్ నంది అవార్డ్స్ కార్యక్రమం విజయవంతం అవడం చాలా అనందంగా ఉంది. ఈ అవార్ట్ ఫంక్షన్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చారు.

Also Read: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Also Read: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News